ఇబ్రహీంపట్నం కు.ని ఘటనలో ట్విస్ట్ : నాకు సంబంధం లేదు, సస్పెన్షన్‌పై హైకోర్టుకెక్కిన సూపరింటెండెంట్

By Siva KodatiFirst Published Sep 24, 2022, 9:54 PM IST
Highlights

ఇబ్రహీంపట్నం కు.ని ఆపరేషన్‌ ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. తనపై ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ వేటుపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ హైకోర్టును ఆశ్రయించారు. అసలు తనకు ఈ కేసుతో సంబంధం లేదని ఆయన చెబుతున్నారు. 

ఇబ్రహీంపట్నం కు.ని ఆపరేషన్‌ ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. తాను ఆసుపత్రికి తాత్కాలిక ఇన్‌ఛార్జ్‌ని మాత్రమేనని డాక్టర్ శ్రీధర్ చెబుతున్నారు. తన సస్పెన్షన్‌పై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయస్థానం విచారించనుంది. ఈ కేసుతో తనకు సంబంధం లేదని శ్రీధర్ అంటున్నారు. తాను ఫండ్స్ ఇన్‌ఛార్జ్‌ని మాత్రమేనన్న ఆయన.. ఈ నెల 25న కలెక్టర్ కార్యక్రమంలో వున్నానని డాక్టర్ శ్రీధర్ చెబుతున్నారు. తాను తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోకి వస్తానని శ్రీధర్ వెల్లడించారు. 

ఇకపోతే..  ఇబ్రహీంపట్నం గవర్నమెంట్ హాస్పిటల్ లో చోటు చేసుకున్న కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ఘటనపై తెలంగాణ సర్కార్ సీరియస్ అయ్యింది. ఈ ఘ‌ట‌న‌పై వ‌చ్చిన నివేదిక ఆధార‌ణంగా చ‌ర్య‌లు తీసుకుంది. రంగారెడ్డి డీఎంహెచ్ వో, డీసీహెచ్ ఎస్ ను ట్రాన్స్ ఫ‌ర్ చేసింది. వీరితో పాటు 13 మంది హెల్త్ సిబ్బందిపై చ‌ర్య‌లు తీసుకుంది. 

ALso REad:ఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ఘటనపై తెలంగాణ స‌ర్కార్ సీరియస్

ఇబ్ర‌హీంప‌ట్నం హాస్పిట‌ల్ డీపీఎల్ క్యాంపు ఆఫీసర్ నాగజ్యోతి, డిప్యూటీ సివిల్ సర్జన్ గీత, హెడ్ నర్స్ చంద్రకళ, అలాగే మాడుగుల్ ప్రైమెరీ హెల్త్ సెంట‌ర్ డాక్ట‌ర్ శ్రీనివాస్, సూపర్ వైజర్లు అలివేలు, మంగమ్మ, మంచాల్ ప్రైమెరీ హెల్త్ సెంట‌ర్ డాక్ట‌ర్ కిర‌ణ్, మిగితా సిబ్బంది జయలత, పూనం, జానకమ్మల ప్ర‌భుత్వం చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించింది. 

హాస్పిట‌ల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ పై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆప‌రేష‌న్లు చేసిన డాక్ట‌ర్ సునీల్ కుమార్ పై కేసు పెట్టాల‌ని ఆదేశించింది. అయితే ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా ఇలాంటి ఆప‌రేష‌న్ల స‌మ‌యంలో తీసుకోవాల్సిన మార్గ‌ద‌ర్శ‌క‌ల‌ను విడుద‌ల చేసింది. అన్ని హాస్పిట‌ల్స్ వీటిని త‌ప్ప‌కుండా పాటించాల‌ని చెప్పింది. 

click me!