#RTC strike పురుగుల మందు తాగిన ఆర్టీసీ కార్మికుడు, పరిస్ధితి విషమం

By Siva KodatiFirst Published Nov 7, 2019, 6:01 PM IST
Highlights

ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో తెలంగాణలో మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. రాణిగంజ్ డిపోలో మెకానిక్‌గా పనిచేస్తున్న షేక్ బాబా సమ్మె, ప్రభుత్వం డెడ్‌లైన్ తదితర పరిణామాల కారణంగా తీవ్రమనస్తాపం చెందాడు

కార్మికుల సమ్మె నేపథ్యంలో తెలంగాణలో మరో కార్మికుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. రాణిగంజ్ డిపోలో మెకానిక్‌గా పనిచేస్తున్న షేక్ బాబా సమ్మె, ప్రభుత్వం డెడ్‌లైన్ తదితర పరిణామాల కారణంగా తీవ్రమనస్తాపం చెందాడు.

ఈ క్రమంలో డబీర్‌పురాలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అతనిని గుర్తించిన కార్మికులు వెంటనే సుచిత్రలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాబా ఆరోగ్య పరిస్ధితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న జేఏసీ నేతలు ఆసుపత్రికి చేరుకుని షేక్ బాబాను పరామర్శించారు. 

సమ్మె ను పరిష్కరించే ఉద్దేశ్యం ప్రభుత్వానికి ఉందా లేదా అనే విషయాన్ని హైకోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రజల కోసం ప్రభుత్వం తన స్టాండ్‌ను మార్చుకోలేదా అని హైకోర్టు అడిగింది.  తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐఎఎస్ అధికారులు సమర్పించిన నివేదికలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది.

Also Read:ఆ ఉద్దేశం ఉందా, లేదా: ఆర్టీసీ సమ్మె కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీసిన హైకోర్టు

సమ్మెపై తెలంగాణ హైకోర్టులో గురువారం నాడు కూడ విచారణ జరిగింది.ఈ విచారణ సమయంలో కేంద్రం తరపున  లాయర్ రాజేశ్వర్ రావు తన వాదనలను విన్పించారు. సమ్మె విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది.

సమ్మె చేస్తున్న కార్మికులు సమ్మె విరమించేందుకు తాత్కాలికంగా రూ. 47 కోట్లు విడుదల చేయాలని తాము కోరితే ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వని విషయాన్ని హైకోర్టు ప్రస్తావించింది.

విభజనకు కేంద్రం అనుమతి ఇచ్చిందా అని హైకోర్టు ఈ సందర్భంగా ప్రశ్నించింది.. ఈ సందర్భంగా కేంద్రం తరపున హైకోర్టుకు హాజరైన కేంద్రం తరపున ఈశ్వరరావు అనే లాయర్ కేంద్రం తరపున వాదనలను విన్పించారు.

విభజనకు కేంద్రం నుండి ఎలాంటి అనుమతి లేదని కేంద్రం తరపు లాయర్  ఈశ్వరరావు చెప్పారు.ఏపీఎస్ఆర్టీసీలో కేంద్రం వాటా 33 శాతం ఉందని అయితే టీఎస్ఆర్టీసీకి 33 శాతం నిధులు ఆటో‌మెటిక్‌గా బదిలీ కావని కేంద్రం వాదించింది

Also Read:ఆర్టీసీకి కేసీఆర్ భారీ షాక్: రూ.452 కోట్ల పన్నుకు నోటీసులు

విభజనకు కేంద్రం ఆమోదం తెలిపినట్టుగా ఎలాంటి ఆధారాలు లేవని కేంద్రం తరపున న్యాయవాది ప్రకటించారు. 9వ షెడ్యూల్ కిందకు వస్తోందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కె జోషి చెప్పారు. విభజన ఇంకా పూర్తి కాలేదని సీఎస్‌తో పాటు తెలంగాణ ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్  హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

 

click me!