rtc strike: టీఎస్ ఆర్టీసీ లేనే లేదు: అశ్వత్థామ రెడ్డి, విశ్వేశ్వరరావు పిల్ పై రేపు విచారణ

By telugu teamFirst Published Nov 7, 2019, 5:09 PM IST
Highlights

హై కోర్టులో ఆర్టీసీ సమ్మెకు సంబంధించిన వాదనలు ముగిసాయి. కేసు తదుపరి విచారణను 11వ తారీఖుకి వాయిదా వేశారు.ఈ లోపల చర్చలు జరపాలని ఆర్టీసీ యాజమాన్యానికి కోర్టు సూచన చేసింది. 

హై కోర్టులో ఆర్టీసీ సమ్మెకు సంబంధించిన వాదనలు ముగిసాయి. కేసు తదుపరి విచారణను 11వ తారీఖుకి వాయిదా వేశారు.ఈ లోపల చర్చలు జరపాలని ఆర్టీసీ యాజమాన్యానికి కోర్టు సూచన చేసింది. 

కేసు వాదనలు పూర్తయిన తరువాత ఆర్టీసీ జేఏసీ నేత అశ్వద్ధామ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, అధికారులతోని కోర్టుకు ఏ విధమైనటువంటి వాదనలు వినిపించాలని చెప్పి రోజుకు తొమ్మిది గంటల పాటు అధికారులతో చర్చలు జరిపే బదులు, ఆర్టీసీ కార్మికుల తో ఒక 90 నిమిషాలు చర్చలు జరిపితే సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది కదా అంటూ ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి మీడియా ముఖంగా ముఖ్యమంత్రిని అభ్యర్థించారు. 

 ఆస్తుల విభజన గురించి కోర్టు ఏమని వ్యాఖ్యానించింది అని ప్రశ్నించగా, ఒకవేళ గనుక కొత్త కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే కొత్త నియామకాలు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందా? కొత్త బస్సులను సర్కార్ కొన్నదా ? అని కోర్టు ప్రశ్నించినట్టు ఆయన తెలిపారు. 70 సంవత్సరాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ న్యాయ చరిత్రలో ఐదుగురు ఐఎఎస్ ఆఫీసర్లను పిలిచి దాదాపు నాలుగు గంటలపాటు వాదనలు వినడం గొప్ప విషయం అని వారి తరుఫు లాయర్ అభిప్రాయపడ్డారు. 

ఎవరి మెప్పు కోసం ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఐఏఎస్ అధికారులను కోర్టు ప్రశ్నించినట్టు వారు తెలిపారు. 5,100 ప్రైవేటు బస్సులకు రూట్ పర్మిట్లు ఇవ్వడం పై హైకోర్టులో తెలంగాణ డెమోక్రాటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు పి ఎల్ విశ్వేశ్వరరావు పిల్ దాఖలు చేశారు.  కోర్టు దాన్ని విచారణకు స్వీకరించింది. రేపు ఉదయం 10.30కు దానిపై వాదనలు విననున్నట్టు కోర్టు ప్రకటించింది.

ఈ సందర్భంగా విశ్వేశ్వర రావు గారు మాట్లాడుతూ, తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అనేది అసలు మనుగడలో లేదని, కేవలం ఏపీఎస్ఆర్టీసీ మాత్రమే ఉందని అన్నారు. ఇంకా ఆర్టీసీ విభజన కాలేదని అన్నారు.  అందుకని కెసిఆర్ కు ఇలా పేర్మిట్లు ఇచ్చే హక్కు లేదని ఆయన అన్నారు. కేంద్రప్రభుత్వం కూడా ఇదే వాదన వినిపించిందని ఆయన అన్నారు. 

ఇలా గనుక ప్రైవేట్ పర్మిట్లకు అనుమతులు ఇస్తే 50 వేల మంది ఆర్టీసీ కార్మికుల జీవితాలు అంధకారంలోకి నెట్టవేయబడుతాయని ఆయన తరుఫు లాయర్ వ్యాఖ్యానించాడు. కార్మికుల గౌరవప్రదమైన జీవనానికి ఇలాంటి రూట్ పర్మిట్లు ఇవ్వడం వారి జీవించే హక్కును హరించివేయడమే అని ఆయన అన్నారు. అందుకే  రైట్ టు లైఫ్ కింద ఈ పిల్ దాఖలు చేసినట్టు తెలిపారు. 

click me!