తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించనందుకుగాను రంగంతండా వాసులు ఓటింగ్ ను బహిష్కరించారు.ఇచ్చిన హమీని నేతలు విస్మించినందున ఓటింగ్ కు దూరంగా ఉన్నామని గ్రామస్తులు చెప్పారు.
మర్రిగూడ: తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతూ రంగంతండావాసులు ఓటింగ్ ను బహిష్కరించారు. ఈ విషయమై తమకు నేతలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టుగా గ్రామస్తులు చెప్పారు. ఓటింగ్ లో పాల్గొనాలని గ్రామస్తులను ఆయా పార్టీలు కోరుతున్నాయి.గట్టుప్పల్ మండలంలోని అంతంపేట గ్రామపంచాయితీ సమీపంలో ఈతండా ఉంది.
రోడ్డు సౌకర్యం కోసం కేటీఆర్ హామీ నిరసన విరమణ
రోడ్డు సమస్య విషయమై రంగంతండా వాసులు ఓటింగ్ ను బహిష్కరించిన విసయాన్నితెలుసుకున్న మంత్రి కేటీఆర్ వారితో మాట్లాడారు.రోడ్డు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు ఓటు హక్కును వినియోగించుకొనేందుకు అంగీకరించారు. తమ నిరసనను విరమించి ఓటింగ్ కు వెళ్లారు.
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఏడు మండలాలున్నాయి. ఈ ఏడు మండలాల్లో 35 మాత్రమే అర్బన్ ప్రాంతంలో పోలింగ్ బూతులున్నాయి. మిగిలిన పోలింగ్ కేంద్రాలన్నీ రూరల్ ప్రాంతంలోనే. ఈనియోజకవర్గంలో చాలా గ్రామాలకు రోడ్ల సౌకర్యం కూడ సరిగా లేదు. మండలకేంద్రానికి వెళ్లే రోడ్లు కూడా అధ్వాన్నంగా ఉన్నాయి. రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారనిప్రకటించడంతో కొన్ని ప్రాంతాల్లో రోడ్ల పనులను చేపట్టారు.
alsoread:ఓటర్లను బీజేపీ ప్రలోభాలకు గురి చేస్తుంది:తెలంగాణ సీఈఓకి మంత్రి జగదీష్ రెడ్డి ఫిర్యాదు
ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన మునుగోడు ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి ఇవాళ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి నాలుగు రోజుల ముందే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అదే నెల 21న బీజేపీలో చేరారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్ధిగా ఈ స్థానం నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. ఈ దఫా బీజేపీ అభ్యర్ధిగా బరిలో కి దిగారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి, టీఆర్ఎస్ అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 2,41855 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో 47 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. 47 మందిలో ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ నెలకొంది.