ఓటర్లను టీఆర్ఎస్ ప్రలోభపెడుతుంది:ఈసీకి బండి సంజయ్ పిర్యాదు

By narsimha lode  |  First Published Nov 3, 2022, 2:06 PM IST

మునుగోడులో ఓటర్లను టీఆర్ఎస్ ప్రలోభపెడుతుందని బీజేపీ ఆరోపించింది.ఈ మేరకు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి  సంజయ్ తెలంగాణ సీఈఓ వికాస్ రాజుకు ఫిర్యాదు చేశారు. 
 


హైదరాబాద్: మునుగోడులో ఓటర్లను టీఆర్ఎస్ ప్రలోభపెడుతుందని బీజేపీ ఆరోపించింది.  ఈ  మేరకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ కి గురువారంనాడు ఫిర్యాదు చేశారు.

మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటర్లను టీఆర్ఎస్ నేతలు , ఆ పార్టీ ప్రజాప్రతినిధులు  నగదు,మద్యం పంపిణీ చేస్తున్నారని కూడ ఆయన ఫిర్యాదు చేశారు.అంతేకాదు స్థానికేతర నేతలను  నియోజకవర్గం నుండి  బయటకు పంపడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు.

Latest Videos

also read:అంతంపేటలో ఉద్రిక్తత:కొందరికే డబ్బులిచ్చారని ఆందోళన, ఓటింగ్ కి నిరాకరిస్తున్నఓటర్లు

మునుగోడులో ఇవాళ ఉదయం పోలింగ్ ప్రారంభమైంది.  పోలింగ్ ప్రారంభమైనా కూడా స్థానికేతర నేతలు నియోజకవర్గంలో మకాం వేసి ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని పలు చోట్ల బీజేపీ శ్రేణులు ఇవాళ ఆందోళనలు నిర్వహించారు. చండూరు,మర్రిగూడ మండలాల్లో బీజేపీ శ్రేణులు ఆందోళనలకు దిగాయి.పోలీసులు కూడ టీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని బీజేపీఆరోపించింది. స్థానికేతర నేతలపైఅందిన ఫిర్యాదులపై  ఎప్పటికప్పుడు స్పందించినట్టుగా తెలంగాణ సీఈఓ వికాస్ రాజు ప్రకటించారు. మొత్తం 42 మంది స్థానికేతర నేతలను పంపించివేసినట్టుగా వికాస్ రాజు ఇవాళ  మీడియాకు ప్రకటించారు.

ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన మునుగోడు ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ కోమటిరెడ్డి రాజగోపాల్  రెడ్డి రాజీనామా  చేశారు. దీంతో ఈ స్థానానికి ఇవాళ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే  పదవికి రాజీనామా  చేయడానికి నాలుగు రోజుల ముందే కోమటిరెడ్డి రాజగోపాల్  రెడ్డి కాంగ్రెస్  పార్టీకి  రాజీనామా  చేశారు.  అదే నెల 21న బీజేపీలో చేరారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్ధిగా ఈ స్థానం నుండి  కోమటిరెడ్డి రాజగోపాల్   రెడ్డి విజయం  సాధించారు. ఈ దఫా  బీజేపీ అభ్యర్ధిగా బరిలో కి దిగారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి, టీఆర్ఎస్ అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీలో  ఉన్నారు. ఈ  నియోజకవర్గంలో 2,41855 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు  అధికారులు ఏర్పాట్లు చేశారు. మునుగోడు  ఉప ఎన్నికల్లో  47 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు.  47  మందిలో  ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ  నెలకొంది.
 

click me!