ఓటర్లను బీజేపీ ప్రలోభాలకు గురి చేస్తుంది:తెలంగాణ సీఈఓకి మంత్రి జగదీష్ రెడ్డి ఫిర్యాదు

By narsimha lode  |  First Published Nov 3, 2022, 2:37 PM IST

మునుగోడులో ఓటర్లను బీజేపీ ప్రలోభాలకు గురి చేస్తుందని టీఆర్ఎస్ ఈసీకి ఫిర్యాదుచేసింది.మంత్రి జగదీష్ రెడ్డితెలంగాణ సీఈఓకి ఈ మేరకు ఇవాళ  ఫిర్యాదు చేశారు.
 


మునుగోడు:పోలింగ్ జరుగుతున్న సమయంలో ఓటర్లను బీజేపీ ప్రలోభపెడుతుందని టీఆర్ఎస్ ఆరోపించింది. ఈ  మేరకు మంత్రి జగదీష్ రెడ్డి తెలంగాణ సీఈఓ వికాస్ రాజ్ కి గురువారంనాడు ఫిర్యాదు చేశారు.చౌటుప్పల్,సంస్థాన్ నారాయణపురం,జనగామ,చండూరు,మర్రిగూడలలో బీజేపీ నగదు పంపిణీ చేస్తుందని  మంత్రి జగదీష్ రెడ్డి పిర్యాదు  చేశారు.

ఈ విషయమై సీఈఓ  వికాస్ రాజ్ తో  మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడారు.బీజేపీ  ప్రలోభాలకు గురి చేస్తున్న అంశంపై  సీఈఓకి ఫోన్ లో  ఫిర్యాదు చేశారు.,బిజెపి మద్యం, డబ్బులు పంపిణీ చేయడాన్ని వెంటనే ఆపేలా చర్యలు తీసుకోవాలని కోరారు.నిన్న రాత్రి నుంచి ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ధర్నాలు, నిరసనలు చేయడంతో భారీగాడబ్బు,మద్యం పంపిణీ చేస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి సీఈఓకి ఫిర్యాదు చేశారు.

Latest Videos

ఈ విషయమై  ఎలక్షన్ సిబ్బంది వెంటనే చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని వికాస్ రాజ్ ని కోరిన మంత్రి కోరారు. క్షేత్రస్థాయిలో అధికారుల పై బెదిరింపులకు దిగుతుందని వికాస్ రాజ్ కు మంత్రి జగదీశ్ రెడ్డి ఫిర్యాదు చేశారు.మరో వైపు ఇదే  డిమాండ్లతో టీఆర్ఎస్ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ నేతృత్వంలోని  బృందం సీఈఓ వికాస్ రాజ్  కి వినతిపత్రం సమర్పించింది.

ఇవాళ ఉదయం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుండి ఓటర్లకు ప్రలోభాల విషయమై టీఆర్ఎస్ ,బీజేపీ పరస్పరం పిర్యాదు చేసుకున్నాయి.అంతేకాదు స్థానికేతరులు ఇంకా  నియోజకవర్గంలోనే ఉన్నారని  బీజేపీ  ఆరోపించింది.ఈ విషయమై చండూరు,మర్రిగూడల్లో బీజేపీ,టీఆర్ఎస్  వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మర్రిగూడలో  ఆందోళన చేసిన బీజేపీ శ్రేణులపై పోలీసులు స్వల్ప లాఠీచార్జీ చేశారు.సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాకలో ఉన్నస్థానికేతరులను ఎన్నికల  అబ్జర్వర్ పట్టుకున్నారు.ఫంక్షన్ హల్ లో నగదు,మద్యం సీజ్ చేశారు.

alsoread:ఓటర్లను టీఆర్ఎస్ ప్రలోభపెడుతుంది:ఈసీకి బండి సంజయ్ పిర్యాదు

ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన మునుగోడు ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ కోమటిరెడ్డి రాజగోపాల్  రెడ్డి రాజీనామా  చేశారు. దీంతో ఈ స్థానానికి ఇవాళ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే  పదవికి రాజీనామా  చేయడానికి నాలుగు రోజుల ముందే కోమటిరెడ్డి రాజగోపాల్  రెడ్డి కాంగ్రెస్  పార్టీకి  రాజీనామా  చేశారు.  అదే నెల 21న బీజేపీలో చేరారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్ధిగా ఈ స్థానం నుండి  కోమటిరెడ్డి రాజగోపాల్   రెడ్డి విజయం  సాధించారు. ఈ దఫా  బీజేపీ అభ్యర్ధిగా బరిలో కి దిగారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి, టీఆర్ఎస్ అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీలో  ఉన్నారు. ఈ  నియోజకవర్గంలో 2,41855 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు  అధికారులు ఏర్పాట్లు చేశారు. మునుగోడు  ఉప ఎన్నికల్లో  47 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు.  47  మందిలో  ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ  నెలకొంది.
 

click me!