అసమ్మతిపై అధిష్టానం ఆగ్రహం: కోమటిరెడ్డికి నోటీసులు?

By narsimha lodeFirst Published Sep 21, 2018, 1:20 PM IST
Highlights

కాంగ్రెస్ కొత్త కమిటీలపై బహిరంగంగా విమర్శలు గుప్పించిన ఎమ్మెల్సీ  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,  మాజీ ఎంపీ వి.హనుమంతరావుల విషయమై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ  క్రమశిక్షణ సంఘం చర్చించనుంది. 

హైదరాబాద్: కాంగ్రెస్ కొత్త కమిటీలపై బహిరంగంగా విమర్శలు గుప్పించిన ఎమ్మెల్సీ  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,  మాజీ ఎంపీ వి.హనుమంతరావుల విషయమై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ  క్రమశిక్షణ సంఘం చర్చించనుంది. శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా సంఘం సమావేశం కానుంది.

కాంగ్రెస్ పార్టీ తాజాగా  ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లు, మరో 9 అనుబంధ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీల కూర్పుపై  కొందరు కాంగ్రెస్ పార్టీ నేతలు  బహిరంగంగానే  విమర్శలు గుప్పించారు. 

ఈ విమర్శల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం సమావేశం కానుంది. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కమిటీల విషయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కమిటీ కూర్పు సరిగా లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

మరోవైపు ప్రచార కమిటీ ఛైర్మెన్ పదవి తనకు దక్కకపోవడంపై కూడ వి.హనుమంతరావు  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో కొందరు కేసీఆర్ కోవర్టులు ఉన్నారని వ్యాఖ్యలు చేశారు.  ఈ ఇద్దరు నేతల తీరుపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం చర్చించనుంది.

పార్టీ నాయకత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన  ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి నోటీసులు పంపే అవకాశం కూడ లేకపోలేదనే ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కమిటీలపై అసంతృప్తులు భవిష్యత్తులో  తీవ్రమైన వ్యాఖ్యలు బహిరంగంగా చేయకూడదనే ఉద్దేశ్యంతోనే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావిస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం  ఏ రకమైన నిర్ణయాలు తీసుకొంటుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది

సంబంధిత వార్తలు

ఇక్కడ కేసీఆర్‌కు, అక్కడ జగన్‌కు కోవర్టులు: వీహెచ్ సంచలనం

టీపీసీసీ కొత్త కమిటీల ఎఫెక్ట్: ట్విస్టిచ్చిన సుధీర్ రెడ్డి

టీపీసీసీ కొత్త కమిటీ ఎఫెక్ట్: కాంగ్రెస్‌లో కేసీఆర్ కోవర్టులు: వీహెచ్

రేవంత్ రెడ్డికి కాంగ్రెస్‌లో నిరసన సెగ

కాంగ్రెస్ తీరు: కారెక్కిన సురేష్‌రెడ్డికి మూడు కమిటీల్లో చోటు

ఎన్నికల కమిటీలు: కాంగ్రెస్‌లో ఇక రేవంత్ జోరు

click me!