వీహెచ్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై కుంతియా స్పందన ఇదీ

By narsimha lodeFirst Published Sep 21, 2018, 2:41 PM IST
Highlights

క్రమశిక్షణను ఉల్లంఘిస్తే  క్రమశిక్షణ చర్యలు తప్పవని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జీ  కుంతియా హెచ్చరించారు.
 


హైదరాబాద్: క్రమశిక్షణను ఉల్లంఘిస్తే  క్రమశిక్షణ చర్యలు తప్పవని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జీ  కుంతియా హెచ్చరించారు.

శుక్రవారం నాడు కుంతియా హైద్రాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. పార్టీ క్రమశిక్షణను అందరూ పాటించాల్సిందేనని కుంతియా చెప్పారు. పార్టీ సీనియర్లు  కూడ  క్రమశిక్షణ విషయంలో  జాగ్రత్తలు తీసుకోవాలని కుంతియా సూచించారు.

పార్టీ కమిటీల విషయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వి.హనుమంతరావులు పార్టీకి వ్యతిరేకంగా  వ్యాఖ్యలు  చేసిన విషయం తన దృష్టికి రాలేదని చెప్పారు. ఎవరైనా కూడ పార్టీ అధిష్టానానికి లోబడి పనిచేయాల్సిందేనని కుంతియా చెప్పారు. 

తాజాగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కమిటీలపై ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు సీరియస్ వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం కోదండరెడ్డి నేతృత్వంలో సమావేశమైంది. ఈ సంఘం ఏ నిర్ణయం తీసుకొంటుందోననే ఆసక్తి సర్వాత్ర నెలకొంది.

సంబంధిత వార్తలు

అసమ్మతిపై అధిష్టానం ఆగ్రహం: కోమటిరెడ్డికి నోటీసులు?

ఇక్కడ కేసీఆర్‌కు, అక్కడ జగన్‌కు కోవర్టులు: వీహెచ్ సంచలనం

టీపీసీసీ కొత్త కమిటీల ఎఫెక్ట్: ట్విస్టిచ్చిన సుధీర్ రెడ్డి

టీపీసీసీ కొత్త కమిటీ ఎఫెక్ట్: కాంగ్రెస్‌లో కేసీఆర్ కోవర్టులు: వీహెచ్

రేవంత్ రెడ్డికి కాంగ్రెస్‌లో నిరసన సెగ

కాంగ్రెస్ తీరు: కారెక్కిన సురేష్‌రెడ్డికి మూడు కమిటీల్లో చోటు

ఎన్నికల కమిటీలు: కాంగ్రెస్‌లో ఇక రేవంత్ జోరు

click me!