మొయినాబాద్‌లో దారుణం: రెండేళ్ల కొడుకు గొంతుకోసి హత్య, భార్యపై కత్తితో దాడి

Published : Jul 13, 2021, 11:16 AM IST
మొయినాబాద్‌లో దారుణం: రెండేళ్ల కొడుకు గొంతుకోసి హత్య, భార్యపై కత్తితో దాడి

సారాంశం

రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ కు సమీపంలోని కేతిరెడ్డిపల్లిలో చోటు చేసుకొంది.  రెండేళ్ల కొడుకును గొంతు కోసి చంపాడు తండ్రి. అంతేకాదు భార్యపై కత్తితో దాడి చేశాడు. భార్య పరిస్థితి విషమంగా ఉంది. 


హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్  లో  మంగళవారం నాడు దారుణం చోటు చేసుకొంది. రెండేళ్ల కొడుకును తండ్రి  గొంతుకోసి హత్యచేశాడు ఆ తర్వాత భార్యను కత్తితో పొడిచాడు. కొడుకు మరణించగా, భార్య చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.నాగసముద్రం గ్రామానికి చెందిన రమేష్ తన కుటుంబంతో  కేతిరెడ్డిపల్లిలో నివాసం ఉంటున్నారు. కేతిరెడ్డిపల్లిలోని ఫామ్ హౌస్ లో  రమేష్ దంపతులు పనిచేస్తున్నారు. రమేష్ కు ఇది రెండో వివాహం.  కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని స్థానికులు చెప్పారు.

ఈ క్రమంలోనే కొడుకు గొంతు కోసి హత్య చేసిన తర్వాత భార్యను రమేష్ కత్తితో పొడిచాడని స్థానికులు చెప్పారు.రెండేళ్ల బాలుడు సంఘటన స్థలంలోనే మరణించాడు. రమేష్ భార్యను చేవేళ్ల  ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రభుత్వాసుపత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. నిందితుడు రమేష్ పరారీలో ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు. రమేష్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్
Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు