గద్వాల జిల్లాలో వందేళ్ల నాటి లాకర్: ఓపెన్ చేస్తే.....

By narsimha lodeFirst Published Jul 13, 2021, 10:40 AM IST
Highlights

జోగులాంబ గద్వాల జిల్లాలో వందేళ్ల నాటి  లాకర్ బయటపడింది. ధరూర్ మండలం భీంపురంలో పాత ఇల్లును కూలుస్తున్న సమయంలో  ఈ  ఘటన చోటు చేసుకొంది. ఈ లాకర్ ను ఓపెన్ చేస్తే దస్తావేజులు లభ్యమయ్యాయి. ఈ లాకర్ లో బంగారం, వెండి ఆభరణాలు ఉంటాయని భావించారు. కానీ దస్తావేజులు మాత్రమే దొరికాయి.

గద్వాల: వందేళ్లనాటి పురాతన లాకర్  జోగులాంబ గద్వాల జిల్లాలో బయటపడింది.  ఈ లాకర్ ను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున వస్తున్నారు.జోగులాంబ జిల్లాలోని ధరూర్ మండలం భీంపురం గ్రామంలో పురాతన ఇల్లు కూల్చివేస్తున్న సమయంలో పాత లాకర్ లభ్యమైంది. ఈ లాకర్ లో బంగారం,వెండి వస్తువులు ఉంటాయనే ప్రచారం సాగడంతో గ్రామంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ లాకర్ ను స్వాధీనం చేసుకొన్న రెవిన్యూ, పోలీసు అధికారులు గ్రామంలోని బీసీ కమ్యూనిటీ హాల్ లో భద్రపర్చారు. ఈ లాకర్ ను నాలుగు గంటలు కష్టపడి ఓపెన్ చేశారు.

అయితే ఈ లాకర్ లో ఓ గుడ్డలో కట్టిన దస్తావేజులు లభ్యమయ్యాయి. ఈ లాకర్ లో తమ కుటుంబానికి చెందిన వ్యాపార లావాదేవీలకు సంబంధించిన పత్రాలను భద్రపర్చేవారని  తమ తల్లిదండ్రులు చెప్పారని ఇంటి యజమానులు తెలిపారు.ఈ లాకర్ లో బంగారం, వెండి ఆభరణాలు  ఉంటాయని ఊహించినప్పటికీ కేవలం దస్తావేజులు మాత్రమే లభ్యం కావడంతో  స్థానికులు నిరాశతో వెనుదిరిగారు.
 

click me!