బ్యాంకులకు టోకరా: ఒడిశాకు చెందిన దీపక్ అరెస్ట్

By narsimha lodeFirst Published Jul 13, 2021, 10:21 AM IST
Highlights

బ్యాంకులను మోసం చేసిన కేసులో ఒడిశాకు చెందిన దీపక్ అనే వ్యక్తిని హైద్రాబాద్ సీసీఎస్ పోలీసులు  మంగళవారం నాడు అరెస్ట్ చేశారు.  మైక్రో ఫైనాన్స్ పేరుతో బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్, ఫైనాన్స్ ల ద్వారా లోన్లు తీసుకొని మోసం చేశారనే నెపంతో  దీపక్ ను అరెస్ట్ చేశారు

హైదరాబాద్: బ్యాంకులను మోసం చేసిన కేసులో ఒడిశాకు చెందిన దీపక్ అనే వ్యక్తిని హైద్రాబాద్ సీసీఎస్ పోలీసులు  మంగళవారం నాడు అరెస్ట్ చేశారు.  మైక్రో ఫైనాన్స్ పేరుతో బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్, ఫైనాన్స్ ల ద్వారా లోన్లు తీసుకొని మోసం చేశారనే నెపంతో  దీపక్ ను అరెస్ట్ చేశారు.

 ఒడిశాలో సంబంధ్ ఫిన్సర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ, సీఈఓ గా దీపక్ కిండో కొనసాగుతున్నారు.ఛత్తీస్‌ఘడ్, ఒడిశా రాష్ట్రాల్లో మైక్రో ఫైనాన్స్  సంస్థలను నిర్వహిస్తున్నట్టుగా  దీపక్ రుణాలు తీసుకొన్నారు.2019లో నాబ్సముద్రి ఫైనాన్స్ కంపెనీ నుండి  రూ. 5 కోట్లు రుణం పొందాడు.  

ఈ నిధులను ఆయన తన స్వంత బ్యాంకు ఖాతాలకు మళ్లించాడు.  ఈ విషయమై బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దీపక్ ను అరెస్ట్ చేశారు.  దీపక్ పై తమిళనాడు, కర్ణాటకల్లో క్రిమినల్ కేసులు నమోదైన విషయాన్ని హైద్రాబాద్ సీసీఎస్ పోలీసులు గుర్తించారు.  దీపక్ ను పోలీసులు విచారిస్తున్నారు. ఈ నిధులను ఏం చేశారనే విషయమై ఆరా తీస్తున్నారు. 
 

click me!