10 రోజులు ఎక్కడికెళ్లారు.. ఫోన్ ఎందుకు స్విచ్ఛాప్ చేశారు: పుట్టా మధుపై పోలీసుల ప్రశ్నలు

By Siva Kodati  |  First Published May 8, 2021, 4:44 PM IST

టీఆర్ఎస్ నేత, పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్టా మధును నాలుగు గంటలుగా విచారిస్తున్నారు రామగుండం పోలీసులు. వామన్ రావు దంపతుల హత్య కేసుకు సంబంధించి వివిధ కోణాల్లో ప్రశ్నలు సంధిస్తున్నారు


టీఆర్ఎస్ నేత, పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్టా మధును నాలుగు గంటలుగా విచారిస్తున్నారు రామగుండం పోలీసులు. వామన్ రావు దంపతుల హత్య కేసుకు సంబంధించి వివిధ కోణాల్లో ప్రశ్నలు సంధిస్తున్నారు.

ఫోన్ స్విచ్చాఫ్ చేసి పది రోజులు ఎక్కడికెళ్లారు..? వామన్ రావు హత్య కేసులో మీ మేనల్లుడి పాత్ర వుందా..? గడిచిన పదిరోజుల్లో ఎక్కడెక్కడ తిరిగారు..? అంత రహస్యంగా ఎందుకు తిరగాల్సి వచ్చింది..? వామన్‌రావుతో మీకు ప్రత్యక్షంగా ఉన్న విభేదాలు ఏమిటీ..? వామన్‌రావు హత్యతో మీకు పరోక్ష సంబంధం వుందని ఎందుకు ఆరోపణలు వస్తున్నాయి..? వామన్‌రావు హత్య కేసులో ప్రధాన నిందితులు వాడిన కారు మీదేనా..? వామన్‌రావు హత్యకు 2 రోజుల ముందు బ్యాంక్ నుంచి 2 కోట్లు ఎందుకు డ్రా చేశారు..? వంటి కోణాల్లో పుట్టా మధును ప్రశ్నిస్తున్నారు పోలీసులు.

Latest Videos

undefined

ఈ నేపథ్యంలో వామన్‌రావు హత్య కేసులో రేపు మధుని న్యాయస్థానం ఎదుట హాజరుపరిచే అవకాశం వుంది. ఇదే  సమయంలో పుట్టా మధు కుటుంబసభ్యులను కూడా పోలీసులు ప్రశ్నించనున్నారు. 

Also Read:వామన్ రావు దంపతుల హత్య కేసు: ప్రత్యేక కోర్టుకు కేసీఆర్ ప్రభుత్వం లేఖ

మరోవైపు వామన్ రావు దంపతుల హత్య కేసు విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రభుత్వం హైకోర్టుకు లేఖ రాశారు. కరీంనగర్ లోని ఓ కోర్టును వామన్ రాపు దంపతుల హత్య కేసు విచారణకు కేటాయించాలని ప్రభుత్వం కోరింది.

మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు పుట్ట మధు అత్యంత సన్నిహితుడనే అభిప్రాయం ఉంది. ఈటల కుమారుడితో కలిసి వ్యాపారాలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దాదాపు 900 కోట్ల రూపాయల ఆస్తులను పుట్ట మధు కూడబెట్టినట్లు కూడా చెబుతారు. చాలా వరకు మహారాష్ట్రలో పుట్ట మధు బినామీల పేరుతో పెట్టుబడులు పెట్టినట్లు చెబుతారు. 

మహారాష్ట్రలోని వ్యాపారాలను పుట్ట మధు సోదరుడు పుట్ట సతీష్ చూసుకుంటారని చెబుతారు. వామన్ రావు హత్య కేసులో పుట్ట మధు చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీనును పోలీసులు అరెస్టు చేశారు 
 

click me!