ఎవరిని వదలం.. పోలీసులపై విమర్శలు మానుకోండి: కాంగ్రెస్ నేతలకు రామగుండం సీపీ కౌంటర్

By Siva KodatiFirst Published Feb 20, 2021, 3:03 PM IST
Highlights

లాయర్ వామన్ రావు దంపతుల హత్య కేసులో నిందితులు ఎంతటివారైనా వదిలిపెట్టమన్నారు రామగుండం పోలీస్ కమీషనర్ సత్యనారాయణ. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కొన్ని రాజకీయ పార్టీలు పోలీసుల మీద విమర్శలు చేయడం సరికాదని సీపీ మండిపడ్డారు. 

లాయర్ వామన్ రావు దంపతుల హత్య కేసులో నిందితులు ఎంతటివారైనా వదిలిపెట్టమన్నారు రామగుండం పోలీస్ కమీషనర్ సత్యనారాయణ. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కొన్ని రాజకీయ పార్టీలు పోలీసుల మీద విమర్శలు చేయడం సరికాదని సీపీ మండిపడ్డారు.

బిట్టు శ్రీను మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు మేనల్లుడేనని ఆయన స్పష్టం చేశారు. విచారణలో గుంజపడుగులో దేవాలయ వివాదమే కారణమని తెలిసిందని సీపీ తెలిపారు. హత్యలో బిట్టు శ్రీను పాత్రపైనా విచారణ చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

కుంట శ్రీనుకు వాహనంతో పాటు మారణాయుధాలు ఇచ్చింది శ్రీనుయేనని తెలిపారు. కాగా.. ఈ కేసులో నిందితుల్ని తప్పించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు శ్రీధర్ బాబు, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు విమర్శించిన సంగతి తెలిసిందే.

Also Read:నేను వజ్రాన్ని.. నాపై ఎందుకీ కుట్రలు: వామన్‌రావు దంపతుల హత్యపై పుట్టా మధు స్పందన

అంతకుముందు లాయర్ వామన్‌రావు దంపతుల హత్యలపై స్పందించారు పెద్దపల్లి జడ్పీ చైర్మన్, టీఆర్ఎస్ నేత పుట్టా మధు. తాను పరారయ్యానని ప్రచారం చేస్తున్నారని.. ఇంకొందరు అమ్ముడుపోయి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఎంతమందినైనా కొనగలరని మధు ఆరోపించారు. తాను ఎమ్మెల్యే, జడ్పీ ఛైర్మన్ కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. నేను హైదరాబాదే వెళ్లలేదని.. నాపై ఎందుకీ కుట్రలు, పగలు అంటూ మధు మండిపడ్డారు.

కేసీఆర్, కేటీఆర్ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. లాయర్ వామన్ రావు దంపతుల హత్యకు నాకు సంబంధం లేదని మధు స్పష్టం చేశారు. తాను వజ్రాన్నంటూ ఆయన వ్యాఖ్యానించారు. 
 

click me!