నేను వజ్రాన్ని.. నాపై ఎందుకీ కుట్రలు: వామన్‌రావు దంపతుల హత్యపై పుట్టా మధు స్పందన

Siva Kodati |  
Published : Feb 20, 2021, 02:30 PM IST
నేను వజ్రాన్ని.. నాపై ఎందుకీ కుట్రలు: వామన్‌రావు దంపతుల హత్యపై పుట్టా మధు స్పందన

సారాంశం

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన లాయర్ వామన్‌రావు హత్యపై స్పందించారు పెద్దపల్లి జడ్పీ చైర్మన్, టీఆర్ఎస్ నేత పుట్టా మధు. తాను పరారయ్యానని ప్రచారం చేస్తున్నారని.. ఇంకొందరు అమ్ముడుపోయి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన లాయర్ వామన్‌రావు హత్యపై స్పందించారు పెద్దపల్లి జడ్పీ చైర్మన్, టీఆర్ఎస్ నేత పుట్టా మధు. తాను పరారయ్యానని ప్రచారం చేస్తున్నారని.. ఇంకొందరు అమ్ముడుపోయి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఎంతమందినైనా కొనగలరని మధు ఆరోపించారు. తాను ఎమ్మెల్యే, జడ్పీ ఛైర్మన్ కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. నేను హైదరాబాదే వెళ్లలేదని.. నాపై ఎందుకీ కుట్రలు, పగలు అంటూ మధు మండిపడ్డారు.

కేసీఆర్, కేటీఆర్ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. లాయర్ వామన్ రావు దంపతుల హత్యకు నాకు సంబంధం లేదని మధు స్పష్టం చేశారు. తాను వజ్రాన్నంటూ ఆయన వ్యాఖ్యానించారు. 
 

PREV
click me!

Recommended Stories

తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ హెచ్చరిక రానున్న 24 గంటల్లో | Heavy Rain Alert for AP & Telangana
School Holidays : ఈ వారంలో ఇంకో నాల్రోజులే స్కూళ్లు నడిచేది.. తర్వాత వరుసగా మూడ్రోజులు సెలవులే