ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కు కరోనా సోకింది.తెలంగాణ రాష్ట్రంలో పలువురు ప్రజా ప్రతినిధులు కరోనా బారిన పడ్డారు. తాజాగా పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావుకు కూడ కరోనా సోకింది.
రామగుండం: ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కు కరోనా సోకింది.తెలంగాణ రాష్ట్రంలో పలువురు ప్రజా ప్రతినిధులు కరోనా బారిన పడ్డారు. తాజాగా పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావుకు కూడ కరోనా సోకింది.
అంతకుముందు కూడ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతకు కరోనా సోకింది.
సోమవారం నాడు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కు కూడ కరోనా సోకినట్టుగా వైద్యులు ప్రకటించారు. ఎమ్మెల్యేతో సమావేశాలైన పార్టీ నేతలు, అధికారులు, ప్రజలు పరీక్షలు నిర్వహించుకోవాలని ఆయన కోరారు. అంతేకాదు వారంతా ఐసోలేషన్ లో ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
also read:ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి కరోనా పాజిటివ్: ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ కు సైతం....
గత 24 గంటల్లో తెలంగాణలో 983 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులసంఖ్య 67, 660కి చేరుకొన్నాయి. హైద్రాబాద్ లో ఎక్కువగా కరోనా కేసులు నమోదౌతున్నాయి. కరోనా వైరస్ కేసులు తగ్గించేందుకు గాను ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకొంటుంది.
2018లో జరిగిన ఎన్నికల్లో రామగుండం నుండి స్వతంత్ర్య అభ్యర్ధిగా పోటీ చేసిన చందర్ టీఆర్ఎస్ అభ్యర్ధి సోమావరపు సత్యనారాయణపై విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్ లో చేరారు.