టెస్టు చేయించుకోకుండానే నెగిటివ్ అంటూ రిపోర్ట్

By telugu news teamFirst Published Aug 3, 2020, 12:07 PM IST
Highlights

అక్కడ తన సహచర ఉద్యోగికి కరోనా సోకడంతో ప్రైమరీ కాంటాక్టుగా ఉన్న ఆయన ములుగు ఏరియా వైద్యశాలలో పరీక్షలు చేయించుకునేందుకు వచ్చాడు.
 


కరోనా వైరస్ కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఊహించని రీతిలో కేసుల సంఖ్య పెరిగిపోతోంది. అయితే.. చాలా చోట్ల కరోనా పరీక్షల విషయంలోనూ గందరగోళం నెలకొంటోంది.  ఓ వ్యక్తికి కనీసం టెస్ట్ కూడా చేయకుండానే నెగిటివ్ రిపోర్టు వచ్చింది. ఈ సంఘటన ములుగులో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ములుగు జిల్లా కేంద్రానికి చెందిన ఓ బ్యాంకు ఉద్యోగి కరీంనగర్‌ జిల్లాలో పనిచేస్తున్నాడు. అక్కడ తన సహచర ఉద్యోగికి కరోనా సోకడంతో ప్రైమరీ కాంటాక్టుగా ఉన్న ఆయన ములుగు ఏరియా వైద్యశాలలో పరీక్షలు చేయించుకునేందుకు వచ్చాడు.

అయితే అతని వివరాలు, ఫోన్‌నెంబర్‌ను తీసుకున్న వైద్యసిబ్బంది.. మరునాడు వస్తే శాంపిళ్లు తీసుకుంటామని చెప్పారు. అయితే ఆ తర్వాత సదరు ఉద్యోగి మొబైల్‌కు ‘వైరస్‌ నెగెటివ్‌’ అంటూ.. ఎస్‌ఎంఎస్‌ వచ్చింది. ఈ విషయమై డీఎంహెచ్‌వో డాక్టర్‌ అప్పయ్యను ఫోన్‌లో వివరణ కోరగా.. కరోనా శాంపిళ్ల సేకరణ విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది తప్పిదమని, పరీక్ష జరిగిందో.. లేదో తెలుసుకోకుండా ఆన్‌లైన్‌ చేయడం వల్ల ఇలా జరిగిందని పేర్కొన్నారు. ఇటువంటి పొరపాటు పునరావృతం కాకుండా చూసుకుంటామని చెప్పారు.

click me!