రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేసిన మోడీ

Siva Kodati |  
Published : Nov 12, 2022, 04:26 PM IST
రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేసిన మోడీ

సారాంశం

రామగుండంలో నూతనంగా నిర్మించిన ఎరువుల కర్మాగారాన్ని ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు. ఇదే వేదికపై నుంచి భద్రాచలం రోడ్- సత్తుపల్లి రైల్వే లైన్‌ను ప్రారంభించారు ప్రధాని. 

రామగుండంలో నూతనంగా నిర్మించిన ఎరువుల కర్మాగారాన్ని ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి హెలికాఫ్టర్‌లో ఆయన రామగుండం చేరుకున్నారు. రామగుండంలో ఏర్పాటు  చేసిన హెలిప్యాడ్ వద్ద ల్యాండ్ అయిన ప్రధాని మోదీ.. రోడ్డు మార్గంలో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నారు. అరగంట పాటు ప్రధాని మోదీ రామగుండం ఎరువుల ఫ్యాకర్టీని సందర్శించారు.అక్కడ ఎరువుల ఉత్పత్తిని పరిశీలించారు. మోదీ వెంట గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, భగవంత్ ఖుబా, కరీంనగర్ ఎంపీ  బండి సంజయ్‌లు ఉన్నారు. 

ALso REad:రామగుండం చేరుకున్న ప్రధాని మోదీ.. అరగంట పాటు ఆర్ఎఫ్‌సీఎల్ సందర్శన..

ఇదే వేదికపై నుంచి భద్రాచలం రోడ్- సత్తుపల్లి రైల్వే లైన్‌ను ప్రారంభించారు ప్రధాని. అలాగే 2200 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ రహదారుల ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో ఎన్‌హెచ్-765డీజీ మెదక్-సిద్దిపేట-ఎల్కతుర్తి సెక్షన్, ఎన్‌హెచ్-161బీబీ బోధన్-బాసర్-భైంసా విభాగం, ఎన్‌హెచ్-353సీ యొక్క సిరోంచ నుండి మహదేవ్‌పూర్ సెక్షన్‌లు ఉన్నాయి. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?