రామ్‌గోపాల్ పేట అగ్నిప్రమాదం: అదుపులోకి రాని మంటలు.. కూలుతున్న స్లాబులు, బిక్కుబిక్కుమంటోన్న స్థానికులు

Siva Kodati |  
Published : Jan 19, 2023, 05:21 PM IST
రామ్‌గోపాల్ పేట అగ్నిప్రమాదం: అదుపులోకి రాని మంటలు.. కూలుతున్న స్లాబులు, బిక్కుబిక్కుమంటోన్న స్థానికులు

సారాంశం

సికింద్రాబాద్ రామ్‌గోపాల్ పేటలోని డెక్కన్ నైట్ వేర్ దుకాణంలో మంటలు అదుపులోకి రావడం లేదు. ఫైబర్, సింథటిక్ మెటీరియల్స్ కారణంతో రెండు స్లాబులు కుప్పకూలాయి.

సికింద్రాబాద్ రామ్‌గోపాల్ పేటలోని డెక్కన్ నైట్ వేర్ దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. అయితే గంటలు గడుస్తున్నా మంటలు ఇంకా అదుపులోకి రావడం లేదు. మరోవైపు డెక్కన్ స్టోర్ భవనం ప్రమాదకర స్థితికి చేరుకుంది. భవనం లోపల 3, 4 అంతస్తుల స్లాబులు కుప్పకూలాయి. మంటల ధాటికి రెగ్జిన్ మెటీరియల్స్ భారీగా తగలబడుతున్నాయి. కార్లకు సంబంధించిన ఫైబర్ మెటీరియల్ అగ్నికి ఆహుతి అయ్యింది. ఫైబర్, సింథటిక్ మెటీరియల్స్ కారణంతో రెండు స్లాబులు కుప్పకూలాయి. ఒక్కొక్క స్లాబ్ కూలుతూ వుండటంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. 

మరోవైపు అగ్నిప్రమాద విషయం తెలుసుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే స్పందించారని అన్నారు తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ. 22 ఫైరింజన్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే గోడౌన్‌లో స్టాక్ ఎక్కువగా వుండటంతో మంటలు అదుపులోకి రావడం లేదని హోంమంత్రి వెల్లడించారు. ఫైర్ డిపార్ట్‌మెంట్ డీజీ నాగిరెడ్డి దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని మహమూద్ అలీ తెలిపారు. భవనంలో ఇద్దరు వ్యక్తులు చిక్కుకుపోయినట్లుగా అనుమానిస్తున్నామని మంత్రి చెప్పారు.

ALso REad: సికింద్రాబాద్ రాంగోపాల్ పేట అగ్ని ప్రమాదం: కేసు నమోదు చేసిన పోలీసులు

అలాగే ఇద్దరు ఫైర్ సిబ్బంది తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని మహమూద్ అలీ చెప్పారు. కొద్దిగంటల్లోనే మంటలను అదుపు చేస్తామని హోంమంత్రి స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా జీహెచ్ఎంసీ , ఫైర్ సిబ్బందితో కలిసి ముందు జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. 

ఇదిలావుండగా ప్రమాదంపై  రాంగోపాల్ పేట పోలీసులు  కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై  పోలీసులు దర్యాప్తు  చేయనున్నారు. నిబంధనలకు విరుద్దంగా  ఈ భవనంలో మెటీరియల్ ను  నిల్వ ఉంచాలని  అధికారులు అభిప్రాయపడుతున్నారు. జనావాసాల మధ్య  ఇలాంటి మెటీరియల్  ను నిల్వ ఉంచడమే  ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. ఈ భవనానికి  ఫైర్ సేఫ్టీ కూడా సరిగా లేదని కూడా అధికారులు గుర్తించారు  

PREV
click me!

Recommended Stories

రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu
రాష్ట్రంలోమంత్రులంతా దొరికిందిదోచుకోవడమే: KTR Comments on CM Revanth Reddy | Asianet News Telugu