బీజేపీకి బీ పార్టీ: టీఆర్ఎస్‌పై రాకేష్ తికాయత్ సంచలన వ్యాఖ్యలు

By narsimha lodeFirst Published Nov 25, 2021, 3:09 PM IST
Highlights


ఎస్‌కెఎం నేత రాకేష్ తికాయత్  గురువారం నాడు టీఆర్ఎస్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి టీఆర్ఎస్ బీ పార్టీ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇవాళ హైద్రాబాద్ లో జరిగే  ధర్నాలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ఆయన ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్: తెలంగాణలో అధికార పార్టీ పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎస్‌కెఎం నేత రాకేష్ తికాయత్  కోరారు.  అఖిల భారత కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ పిలుపు మేరకు గురువారం నాడు  హైద్రాబాద్ లో ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన ధర్నాలో ఎస్‌కెఎం నేత రాకేష్ తికాయత్ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన ఓ తెలుగు న్యూస్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.  ఈ ఇంటర్వ్యూలో  ఆయన   టీఆర్ఎస్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రైతులకు కూడా ప్రభుత్వం పరిహారం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. 

బీజేపీకి, టీఆర్ఎస్ బీ పార్టీ అని రాకేష్ తికాయత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి కొమ్ముకాసే టీఆర్ఎస్ ను ఢిల్లీకి పంపొద్దని ఆయన ప్రజలను కోరారు తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకొన్న రైతులకు పరిహారం ఇవ్వాలని ఆయన కోరారు. తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేసే వరకు రైతులకు అండగా ఉంటామన్నారు. రైతులకు పంటలకు మద్దతు ధర ప్రకటించే వరకు ఉద్యమం కొనసాగుతుందని చెప్పారు. బడా కంపెనీలకు  అనుకూలంగా మోడీ నిర్ణయాలు ఉన్నాయని ఆయన విమర్శించారు. రైతు సంఘాలు అడిగిన ప్రశ్నలకు ప్రధాని వద్ద సమాధానం లేదన్నారు. 

also read:రేపు హైద్రాబాద్ ఇందిరాపార్క్ వద్ద రైతు సంఘాల ధర్నా: పాల్గొననున్న రాకేష్ తికాయత్

కేంద్రాన్ని Rss నడిపిస్తోందని ఆయన విమర్శించారు. బాష వేరు కావొచ్చు , కానీ రైతులందరి లక్ష్యం ఒకటేనని Rakesh Tikait  చెప్పారు. ఆందోళనలు చేసే వారిని  ప్రలోభాలకు గురి చేశారన్నారు.  అయినా కూడా రైతులంతా  ఏకతాటిపై నిలబడ్డారని చెప్పారు.  Narendra Modi ప్రకటనతో వెనక్కి తగ్గేది లేదని ఆయన తేల్చి చెప్పారు. తమ ఆందోళన కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.  పండించిన పంటకు మద్దతు ధర చట్టం తేవాల్సిందేనని  రాకేష్ తికాయత్ కోరారు.సంయుక్త కిసాన్ మోర్చాలో విబేధాలు తెచ్చే కుట్రలు తెస్తోందని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన  నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ  ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాదిగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు, వచ్చే ఏడాదిలో పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్ సహా మరికన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని  కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకొందనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.నూతన వ్యవసాయ చట్టాలను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయితే ఏడాదిగా ఈ చట్టాలను నిరసిస్తూ రైతులు చేసిన పోరాటం కారణంగా కేంద్రం ఈ చట్టాలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయం తీసుకొంది. 

గత ఏడాది తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకొంటామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ప్రకటించారు. త్వరలోనే జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును కేంద్రం ప్రవేశ పెట్టనుంది.అయితే తమ డిమాండ్లు నెరవేర్చేవరకు తమ ఆందోళనలను కొనసాగిస్తామని  రైతు సంఘాలు ప్రకటించాయి. తెలంగాణలో రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు విషయమై కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం తాడో పేడో తేల్చుకోవాలని భావిస్తుంది. అయితే  వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసే వరకు తాము అండగా ఉంటామని రాకేష్ తికాయత్ హమీ ఇచ్చారు. ఇదే విషయమై ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ నిన్న హైద్రాబాద్ కు తిరిగి వచ్చారు. 

 

click me!