రాజీవ్ గాంధీ సద్భావన యాత్రను ప్రారంభించిన రాహుల్

Published : Oct 20, 2018, 06:24 PM IST
రాజీవ్ గాంధీ సద్భావన యాత్రను ప్రారంభించిన రాహుల్

సారాంశం

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన బిజీబిజీగా కొనసాగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాలో బహిరంగ సభలలో పాల్గొన్న రాహుల్ గాంధీ ఛార్మినార్ వద్ద ఏర్పాటు చేసిన కాంగ్రెస్ సద్భావన యాత్రలో  పాల్గొన్నారు. రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ సద్భావన యాత్రను ప్రారంభించారు. 

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన బిజీబిజీగా కొనసాగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాలో బహిరంగ సభలలో పాల్గొన్న రాహుల్ గాంధీ ఛార్మినార్ వద్ద ఏర్పాటు చేసిన కాంగ్రెస్ సద్భావన యాత్రలో  పాల్గొన్నారు. రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ సద్భావన యాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య, మాజీఎంపీ వీహెచ్, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. 

దేశానికి మాజీప్రధాని రాజీవ్ గాంధీ ఎంతో సేవ చేశారని మాజీఎంపీ వీహెచ్ అన్నారు. ఆయన తనయుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో తామంతా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ సద్భావన స్మారక సమితి అవార్డును కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అందజేశారు. 

PREV
click me!

Recommended Stories

Real estate: హైద‌రాబాద్‌లోని ఈ శివారు ప్రాంతం మ‌రో కూక‌ట్‌ప‌ల్లి కావ‌డం ఖాయం.. ఇప్పుడే కొనేయండి
Free Bus Scheme : తెలుగోళ్లకు గుడ్ న్యూస్... మహిళలకే కాదు పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం