దైవదర్శనానికి వెళ్తున్న యువజంట...అంతలోనే రోడ్డు ప్రమాదం

Published : Oct 20, 2018, 04:20 PM IST
దైవదర్శనానికి వెళ్తున్న యువజంట...అంతలోనే రోడ్డు ప్రమాదం

సారాంశం

ఎన్నో కలలు కంది ఆ జంట. రెండు నెలల క్రితం కుటుంబసభ్యులు బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా నిశ్చితార్థం కూడా చేసుకుంది. ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఉద్యోగులే. తమను ఆశీర్వదించాలని దేవుడిని వేడుకునేందుకు బయలుదేరారు. ఆ జంటను చూసి ఎవరి కన్నుకుట్టిందో ఏమో యువజంటను కారు రూపంలో మృత్యువు వెంటాడింది.

హైదరాబాద్: ఎన్నో కలలు కంది ఆ జంట. రెండు నెలల క్రితం కుటుంబసభ్యులు బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా నిశ్చితార్థం కూడా చేసుకుంది. ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఉద్యోగులే. తమను ఆశీర్వదించాలని దేవుడిని వేడుకునేందుకు బయలుదేరారు. ఆ జంటను చూసి ఎవరి కన్నుకుట్టిందో ఏమో యువజంటను కారు రూపంలో మృత్యువు వెంటాడింది. యువతిని బలితీసుకోగా..యువకుడిని ఆస్పత్రిపాల్జేసింది. ఈ విషాదఘటన మేడ్చల్ లో చోటు చేసుకుంది. 

వివరాల్లోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వినీషా, కిరణ్ లు హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. వీరిద్దరికి రెండు నెలల క్రితం వివాహ నిశ్చితార్థం జరిగింది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. వినీషా ఎస్ఆర్ నగర్ లో ఉంటూ గూగుల్ సంస్థలో పనిచేస్తోంది. 

త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ఈ యువజంట యాదగిరి గుట్ట దైవదర్శనానికి బయలుదేరారు. ఉప్పల్ సమీపంలో వారి బైక్ అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరు రోడ్డుపై పడ్డారు. వారి వెనుక నుంచి వేగంగా వస్తున్న ఓ కారు వినీషా మీద నుంచి దూసుకెళ్లింది. 

దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కళ్లెదుటే కాబోయే భార్య ప్రాణాలు కోల్పోవడంతో కిరణ్ షాక్ కు గురయ్యాడు. మృతదేహాన్ని పట్టుకుని బోరున విలపిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టారు. 

PREV
click me!

Recommended Stories

రేవంత్‌రెడ్డిపై భోరున ఏడ్చిన కొండా సుష్మిత | Konda Sushmita Emotional Comments On CM Revanth Reddy
Student Scholarship: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ఏడాదికి రూ. 12,000 స్కాలర్‌షిప్, అప్లై పూర్తి వివరాలు ఇవే