డ్రోన్ కెమెరాల కేసు: రేవంత్ రెడ్డికి రాజేంద్ర నగర్ కోర్టు షాక్

Published : Mar 07, 2020, 08:33 AM ISTUpdated : Mar 11, 2020, 04:35 PM IST
డ్రోన్ కెమెరాల కేసు: రేవంత్ రెడ్డికి రాజేంద్ర నగర్ కోర్టు షాక్

సారాంశం

కేటీఆర్ బంధువులకు చెందిన ఫాంహౌస్ దృశ్యాలను డ్రోన్ కెమెరాతో చిత్రీకరించారనే ఆరోపణతో నమోదైన కేసులో కాంగ్రెసు ఎంపీ రేవంత్ రెడ్డికి రాజేంద్రనగర్ కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది.

హైదరాబాద్: తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిరిగి ఎంపీ రేవంత్ రెడ్డికి రాజేంద్రనగర్ కోర్టు షాక్ ఇచ్చింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బంధువులకు చెందిన ఫాంహౌస్ ను అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాతో చిత్రీకరించారనే కేసులో ఆయనకు రాజేంద్రనగర్ కోర్టు బెయిల్ నికారించింది. 

ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్న రేవంత్ రెడ్డి బెయిల్  పిటిషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అయితే ఆయనతో పాటు అరెస్టయిన ఐదుగురికి మాత్రం బెయిల్ మంజూరు చేసింది. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో రేవంత్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. 

Also Read: కేసీఆర్ ఫామ్ హౌస్ ను కూల్చే దమ్ము లేదు: రేవంత్ అరెస్టుపై భగ్గుమన్న కోమటిరెడ్డి

డ్రోన్ కెమెరా చిత్రీకరణ కేసులో రేవంత్ రెడ్డి ప్రధాన నిందితుడు. రేవంత్ రెడ్డి అరెస్టును కాంగ్రెసు నాయకులు తీవ్రంగా తప్పు పడుతున్నారు. తెలంగాణ కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ కుంతియాతో పాటు తెలంగాణ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మల్లుభట్టి విక్రమార్క రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలిచారు. 

రేవంత్ రెడ్డిని ఈ నెల 5వ తేదీన నార్సింగ్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాదు శివారులోని శంకర్ పల్లి సమీపంలో గల జన్వాడలో ఉన్న ఫాంహౌస్ లోని దృశ్యాలను రేవంత్ రెడ్డి డ్రోన్ కెమెరాతో చిత్రీకరించారనే ఆరోపణలను ఎదుర్కుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రేవంత్ రెడ్డి డ్రోన్ కెమెరాలను ఉపయోగించారని పోలీసులు కేసు నమోదు చేశారు. 

Also Read: రేవంత్ రెడ్డి అరెస్ట్ కక్షసాధింపు చర్యే: కుంతియా

రేవంత్ రెడ్డితో పాటు ప్రవీణ్, విజయసింహ, జైపాల్ రెడ్డి, శివ, ఓంప్రకాశ్ లను కూడా పోలీసులు అరెస్టు చేశారు. వీరికి రాజేంద్రనగర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేటీఆర్ బంధువులకు చెందిన ఫాంహౌస్ ఉన్న ప్రాంతాన్ని నో ఫ్లయింగ్ జోన్ గా పోలీసులు ప్రకటించారు. 

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?