కలెక్టర్లతో చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ భేటీ: అక్టోబర్ లో షెడ్యూల్?

By narsimha lodeFirst Published Sep 7, 2018, 10:39 AM IST
Highlights

 తెలంగాణలో అసెంబ్లీ రద్దు చేసిన తర్వాత ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కసరత్తుప్రారంభమైంది.  శుక్రవారం నాడు హైద్రాబాద్‌లో పలు జిల్లాల కలెక్టర్లతో  రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్  తన కార్యాలయంలో సమావేశమయ్యారు


హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ రద్దు చేసిన తర్వాత ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కసరత్తుప్రారంభమైంది.  శుక్రవారం నాడు హైద్రాబాద్‌లో పలు జిల్లాల కలెక్టర్లతో  రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్  తన కార్యాలయంలో సమావేశమయ్యారు. త్వరలో జరిగే  నాలుగు రాష్ట్రాల ఎన్నికలతో పాటే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి కూడ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. 

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేస్తూ కేసీఆర్ మంత్రివర్గం గురువారం నాడు  నిర్ణయం తీసుకొంది. మరో ఆరు మాసాల్లోనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. దీంతో  ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాట్లను  చేపట్టారు.

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్  తన కార్యాలయంలో  అన్ని జిల్లాల కలెక్టర్లతో  శుక్రవారం నాడు తన కార్యాలయంలో సమావేశమయ్యారు.  జిల్లాల్లో జిల్లా కలెక్టర్లు జిల్లా ఎన్నికల అధికారులుగా వ్యవహరించనున్నారు.

తెలంగాణలో ఎన్నికల  నిర్వహణకు సంబంధించి ఈవీఎంలు, వీవీప్యాడ్‌లు, ఓటర్ల జాబితా, ఓటర్ల జాబితా సవరణ, ఎన్నికల అధికారులు తదితర విషయాలపై కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్  చర్చించనున్నారు.

దీంతో  ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి కసరత్తు గురించి  కలెక్టర్లతో రజత్ కుమార్ చర్చించనున్నారు.  మరో వైపు   త్వరలో  నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఎన్నికల అధికారులతో కేంద్ర ఎన్నికల కమిషనర్ ఢిల్లీలో శుక్రవారం నాడు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్రం నుండి  ఇద్దరు మహిళా అధికారులు కూడ హాజరైనట్టు సమాచారం.

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి  కూడ అక్టోబర్ మాసంలోనే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. అక్టోబర్ లోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే  నవంబర్ చివరి వారానికి  ఎన్నికలు పూర్తయ్యే అవకాశం లేకపోలేదని సమాచారం.

click me!