తెలంగాణ సర్కార్ పై రేవంత్ కు రైల్వే జీఎం లేఖ..

By AN TeluguFirst Published Oct 7, 2020, 3:26 PM IST
Highlights

తెలంగాణ ప్రభుత్వం సహకరించకపోవడం వల్లే ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయని రైల్వే జీఎం తనకు రాసిన లేఖలో పేర్కొన్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. తన నియోజకవర్గంలో రైల్వే ప్రాజెక్టులపై రేవంత్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంతో గతేడాది రైల్వే శాఖకు లేఖ కూడా రాశాడు.

మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టులపై ఇటీవలే రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ తో వీడియో కాన్ఫరెన్స్ లోనూ చర్చించానని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి వెల్లడించారు. 

తన లేఖకు బదులుగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సుదీర్ఘ వివరణతో కూడిన ప్రత్యుత్తరం ఇచ్చారని ఆయన తెలిపారు. ఆ లేఖలో రైల్వే ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి తమకు సహకారం అందడంలేదని రైల్వే జీఎం పేర్కొన్నారని రేవంత్ వివరించారు. 

రైల్వే జీఎం అంశాల వారీగా జవాబు ఇచ్చారు. టీఆర్ఎస్ సర్కారు ఉదాసీనంగా వ్యవహరిస్తోందని, సహకారం అందించేందుకు ముందుకు రావడంలేదని తెలిపారు. సర్కారు పూర్తి నిర్లక్ష్యం కారణంగానే ప్రాజెక్టులు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా తయారయ్యాయని జీఎం వివరించారు" అంటూ రేవంత్ ట్వీట్ చేశారు.

click me!