హైదరాబాద్ కిడ్నాప్ కేసు: టీడీపీ మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై కేసు

By Siva KodatiFirst Published Oct 7, 2020, 2:41 PM IST
Highlights

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన బంజారాహిల్స్ కిడ్నాప్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. బాధితుడు 15 మందిపై కేసు పెట్టాడు. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన శివగణేశ్‌ను ఓ ల్యాండ్ సెటిల్ మెంట్ కోసం స్నేహితుడు రామచంద్రారెడ్డి హైదరాబాద్‌కు పిలిపించాడు. 

కొండారెడ్డి ఆఫీసులో పంచాయితీకి కూర్చొన్న శివగణేశ్‌ను బెదిరించి సంతకాలు చేయించుకున్నారు కొండారెడ్డి, రామచంద్రారెడ్డి. తనను కిడ్నాప్ చేయడంతో పాటు తుపాకితో బెదిరించి సంతకాలు చేయించుకున్నారని శివగణేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కొండారెడ్డి.. టీడీపీ నేత వరదరాజుల రెడ్డి కుమారుడు. మరోవైపు తనకు రక్షణ కల్పించాలంటూ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు శివగణేశ్. దీనిపై కేసు నమోదు  చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు.

ఇప్పటి వరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని తెలిపారు. కాగా కొండారెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. మెడికల్ డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేస్తున్న శివగణేశ్‌ను కొండారెడ్డి గ్యాంగ్ కిడ్నాప్ చేసినట్లుగా గుర్తించారు.

మొత్తం నాలుగు టీమ్‌లు కేసును దర్యాప్తు చేస్తున్నాయి. శ్రీనగర్‌ కాలనీలోని శివగణేశ్ ఇంటికి వెళ్లారు బంజారాహిల్స్ పోలీసులు. అయితే తన కుమారుడి దౌర్జన్యాలపై మాట్లాడేందుకు నిరాకరించారు వరదరాజుల రెడ్డి. 
 
click me!