
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఖమ్మంలో జరుగుతున్న జనగర్జన సభకు చేరుకున్నారు. అంతకుముందు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్ గాంధీకి ఏపీ కాంగ్రెస్ నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన హెలికాఫ్టర్‌లో బయల్దేరి ఖమ్మం సభావేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తదిరత నేతలు రాహుల్‌కు స్వాగతం పలికారు. అనంతరం సభా వేదికపైకి చేరుకుని ప్రజలకు అభివాదం చేశారు. ఈ క్రమంలో ప్రజాగాయకుడు, ప్రజా యుద్ధ నౌక రాహుల్‌ను ముద్దాడారు.