Rahul Gandhi Telangana tour: చంచల్‌గూడ జైలుకు రాహుల్ గాంధీ.. ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలతో ములాఖత్..

Published : May 07, 2022, 01:57 PM ISTUpdated : May 07, 2022, 02:26 PM IST
 Rahul Gandhi Telangana tour: చంచల్‌గూడ జైలుకు రాహుల్ గాంధీ.. ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలతో ములాఖత్..

సారాంశం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చంచల్ గూడ జైలులో ఎన్‌ఎస్‌యూఐ నాయకులను పరామర్శించారు. చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌తో సహా 18 మంది నాయకులను రాహుల్ గాంధీతో ములాఖత్ అయ్యారు. 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చంచల్ గూడ జైలులో ఎన్‌ఎస్‌యూఐ నాయకులను పరామర్శించారు. చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌తో సహా 18 మంది నాయకులను రాహుల్ గాంధీతో ములాఖత్ అయ్యారు. దాదాపు 15 నిమిషాలతో పాటు ఈ భేటీ  సాగింది. పార్టీ తరఫున వారికి రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారు. రాహుల్‌తో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎన్‌ఎస్‌యూఐ నాయకుల వద్దకు వెళ్లారు. చంచల్‌గూల్ జైలులో రాహుల్‌తో పాటు ఒక్కరు మాత్రమే ఎన్‌ఎస్‌యూఐ నాయకులతో ములాఖత్ అయ్యేందుకు అధికారులు అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేవలం భట్టి విక్రమార్క ఒక్కరే రాహుల్‌తో వెళ్లారు. 

ఇక, చంచల్ గూడ జైలు వద్ద టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని ఓయూకు రావాలని దళిత, గిరిజన విద్యార్థులు ఆహ్వానించారని చెప్పారు. కానీ ఓయూ వీసీ అనుమతి ఇవ్వలేదన్నారు. ఓయూ వీసీని పర్మిషన్ అడిగేందుకు వెళ్తే ఎన్‌ఎస్‌యూఐ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పారు. ఓయూకు వెళ్లకుండా రాహుల్‌ను కావాలనే అడ్డుకున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ పతనానికి ఇది నాంది అని అన్నారు. నిబంధనల ప్రకారం.. ప్రతి ఒక్క ముద్దాయి ముగ్గురిని కలవవచ్చని చెప్పారు. కేసీఆర్‌ ఒత్తిడితోనే ఇద్దరికి మాత్రమే అనుమతిచ్చారని అన్నారు. ఇది అనాగరిక చర్య అని మండిపడ్డారు.  

 

ఇక, చంచల్‌గూడ జైలు నుంచి బయలుదేరిన రాహుల్..  గాంధీ భవన్ చేరుకుంటారు. గాంధీభవన్ లో పార్టీ extended మీటింగ్ లో పాల్గొంటారు. పార్టీ మెంబర్ షిప్ కో ఆర్డినేతలతో ఫోటోలు దిగుతారు. ఈ  కార్య‌క్ర‌మం అనంత‌రం గాంధీ భవన్ నుంచి బైరోడ్ ద్వారా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. సాయంత్రం 5:50 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీ వెళ్తారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

First Railway Station in Telangana: తెలంగాణ మొదటి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా? దీనిని ఎవరు కట్టించారు? ఎందుకు?
Cyclone Alert : బలపడుతోన్న అల్పపీడనం, తుపాన్ లోడింగ్? ఈ 9 జల్లాల్లో కుండపోత వర్షాలతో అల్లకల్లోలమే