
కామారెడ్డి జిల్లాలో ఎల్లారెడ్డి మండలం మాలన్‌ఖేడ్‌లో విషాదం చోటుచేసుకుంది. నిజాంసాగర్ బ్యాక్ వాటర్‌లో పడి ముగ్గురు మృతిచెందారు. మృతులను లింగపేట మండలంలోని ముంబాజిపేట గ్రామానికి చెందిన బోయినీ లింగవ్వ, ఆమె కూతురు రీనా, మేనకోడలు సౌమికగా గుర్తించారు. వీరంతా మౌలాన్ ఖేడ్ గ్రామంలో ఉన్న బంధువుల ఇంటికి వచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
ఈ ప్రమాదం ఎలా జరిగిందనే వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.