పొంగులేటి శ్రీనివాస్‌తో రాహుల్ గాంధీ టీమ్ భేటీ.. సుదీర్ఘంగా మంతనాలు.. కాంగ్రెస్‌లోకి పొంగులేటి?

Published : Apr 17, 2023, 10:56 PM IST
పొంగులేటి శ్రీనివాస్‌తో రాహుల్ గాంధీ టీమ్ భేటీ.. సుదీర్ఘంగా మంతనాలు.. కాంగ్రెస్‌లోకి పొంగులేటి?

సారాంశం

పొంగులేటి శ్రీనివాస్‌తో రాహుల్ గాంధీ టీమ్ సుదీర్ఘంగా చర్చలు జరిపింది. పొంగులేటి నివాసంలోనే వారు భేటీ అయ్యారు. పార్టీకి ఆహ్వానం అందించింది. పొంగులేటికి కీలకమైన ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలోనే పొంగులేటి నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.  

హైదరాబాద్: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలు, నేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. నేడు తెలంగాణలో పొంగులేటి శ్రీనివాస్ పార్టీ మార్పుపై చర్చ నడుస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ ఆయనను సస్పెండ్ చేసిన తర్వాత ఆయన ఏ పార్టీలో చేరుతారనే విషయంపై ఆసక్తి నెలకొంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి సామాజికంగా, ఆర్థికంగా బలమైన అభ్యర్థి. అందుకే ఆయనకు అన్ని పార్టీల నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి.

అయితే, కాంగ్రెస్ పార్టీ అడుగు ముందుకేసి ఆయనతో సుదీర్ఘ మంతనాలు జరిపినట్టు తెలిసింది. పొంగులేటి శ్రీనివాస్‌తో రాహుల్ గాంధీ టీమ్ సమావేశమై ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించింది. సుమారు ఆరు గంటలపాటు పొంగులేటి నివాసంలోనే ఈ చర్చ జరిగింది. పొంగులేటి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలోకి మారితే ఖమ్మంలో పార్టీ క్లీన్ స్వీప్ చేయవచ్చని కాంగ్రెస్ భావిస్తున్నది.

రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మంపై అన్ని పార్టీలు ఫోకస్ పెట్టాయి. కమ్యూనిస్టు పార్టీలు, బీఆర్ఎస్, కాంగ్రెస్, వైఎస్సార్టీపీ, టీడీపీ ఇలా పార్టీలు ఇక్కడ దృష్టి పెట్టాయి. ఇక్కడి ఓటర్ల విభిన్న అభిప్రాయాలు, ఆలోచనల నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఈ పార్టీలు ఫోకస్ పెట్టాయి. 

Also Read: వార్నీ.. మహిళను కాటేసిన పాము.. విషసర్పాన్ని కూడా హాస్పిటల్ కు తీసుకెళ్లిన భర్త.. యూపీలో వింత ఘటన

కాంగ్రెస్ ఇక్కడ ఎక్కువ ఆశలు పెట్టుకుంటున్నది. ఇప్పటికే ఇక్కడ మధిరలో భట్టి విక్రమార్క, భద్రాచలంలో పోదెం వీరయ్యలు ఉన్నారు. ఇక ఖమ్మ నియోజకవర్గంలో జావిద్, సత్తుపల్లి స్థానంలో సంబాని చంద్రశేఖర్, పాలేరు నియోజకవర్గంలో రాయల నాగేశ్వరరావులు ఉన్నారు. అయితే, పొంగులేటి కాంగ్రెస్‌లోకి వస్తే.. ఆయన చెప్పిన అభ్యర్థులనే ఈ స్థానాల్లో నిలబెట్టడానికి కాంగ్రెస్ సుముఖతను చూపినట్టు సమాచారం. మధిర, భద్రాచలం సీట్లు మినహా మిగితా స్థానాల్లో అభ్యర్థులపై పొంగులేటి నిర్ణయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి అంగీకరించినట్టు తెలిసింది.

ఈ నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాస్ నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళతారా? లేక వేగంగా పుంజుకుంటున్న బీజేపీలో చేరుతారా? అనే విషయంపై చర్చ జరుగుతున్నది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్