తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మాజీ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్‌లో ఆకస్మికంగా పర్యటించారు. నగరంలోని అశోక్ నగర్‌లో ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతోన్న నిరుద్యోగులతో భేటీ అయ్యారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరో నాలుగు రోజుల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీంతో గెలుపు లక్ష్యంగా అన్నీ పార్టీలు ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నాయి. అధికార బీఆర్ఎస్ ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇక గులాబీ బాస్ కే. చంద్రశేఖర్ రావు .. తన వయస్సును కూడా లేక చేయకుండా.. రోజుకు రెండు, మూడు.. వీలైతే.. నాలుగు బహిరంగసభల్లో పాల్గొంటున్నారు. తమ పార్టీ అభివ్రుద్ది, సంక్షేమ పథకాలను వివరించుకుంటునే.. ప్రతిపక్షాలపై విమర్శస్త్రాలు సంధిస్తున్నారు.
ఈ క్రమంలో తెలంగాణలో ఈ సారి ఎలాగైనా అధికార పగ్గాలను చేజిక్కించుకోవాలని హస్తం పార్టీ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఆ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. వరుసగా బహిరంగ సభలు, రోడ్ షోల్లో పాల్గొంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అధికార బీఆర్ఎస్, బీజేపీలపై విమర్శలు గుప్పించుకుంటూ.. తనదైన శైలీలో ప్రచారం సాగిస్తున్నారు రాహుల్ గాంధీ.
undefined
ఇదిలా ఉండగా.. శనివారం రాత్రి హైదరాబాద్‌లో రాహుల్ గాంధీ ఆకస్మిక పర్యటించారు.నగరంలోని ముషీరాబాద్, అశోక్ నగర్‌లో పర్యటించి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులతో రాహుల్ చిట్ చాట్ నిర్వహించారు. నిరుద్యోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి బాధలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో జరిగిన పేపర్ లీక్ ఘటనలు, నోటిఫికేషన్ల నిలిపివేత వంటి అంశాలను రాహుల్ గాంధీ దృష్టికి తీసుకువచ్చారు నిరుద్యోగులు. నిరుద్యోగుల వల్ల సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నా.. వైఖరిని తీవ్రంగా ఖండిచారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే.. నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలు తీరుస్తానని రాహుల్ హామీ ఇచ్చారు. అనంతరం నిరుద్యోగులతో కలిసి చిక్కడపల్లిలోని బావార్చి హోటల్‌లో బిర్యానీ తిన్నారు రాహుల్. అక్కడి కస్టమర్లతో ముచ్చటించారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీతో పలువురు సెల్ఫీలు దిగారు.