షాద్‌నగర్ స్టూడెంట్ ఐశ్వర్య సూసైడ్: రాహుల్ గాంధీ స్పందన

Published : Nov 09, 2020, 03:34 PM IST
షాద్‌నగర్ స్టూడెంట్ ఐశ్వర్య సూసైడ్: రాహుల్ గాంధీ స్పందన

సారాంశం

 తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్ కు చెందిన విద్యార్ధిని ఐశ్యర్య ఆత్మహత్యపై కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ స్పందించారు.  


హైదరాబాద్: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్ కు చెందిన విద్యార్ధిని ఐశ్యర్య ఆత్మహత్యపై కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ స్పందించారు.

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని ఆయన ఆరోపించారు.కేంద్రం తీసుకొచ్చిన పెద్ద నోట్ల రద్దుతో పాటు లాక్‌డౌన్ దేశంలోని అనేక కుటుంబాలను తీవ్రంగా నష్టాలకు గురి చేసిందన్నారు.

 

ఐశ్యర్య కుటుంబానికి రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు. లాక్‌డౌన్ దేశంలోని అనేక కుటుంబాలను నాశనం చేసింది... ఇది నిజమని ఆయన పేర్కొన్నారు.షాద్ నగర్ కు చెందిన ఐశ్వర్య ఢిల్లీలోని శ్రీరామ్ డిగ్రీ కాలేజీలో చదువుతోంది. కరోనా ను పురస్కరించుకొని కాలేజీ యాజమాన్యం ఆమెను హాస్టల్ నుండి ఖాళీ చేయించింది.

ఆదివారం నాడు ఇంట్లోనే ఆమె ఆత్మహత్య చేసుకొంది. కుటుంబానికి తాను భారంగా మారకూడదనే ఉద్దేశ్యంతో ఆత్మహత్య చేసుకొంది.చిన్నప్పటి నుండి ఐశ్వర్య  చదువులో టాపర్. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ , టెక్నాలజీ ఇచ్చే స్కాలర్ షిప్ కింద బీఎస్సీ చదువుతోంది.

also read:ఢిల్లీలో చదువు: ఇంటికొచ్చి ఉరేసుకున్న తెలుగు విద్యార్ధిని
ఈ ఏడాది మార్చి నుండి స్కాలర్ షిప్ రాలేదు. దీంతో పుస్తకాలు, స్కాలర్ షిప్ రాకపోవడంతో ఆమె ఇబ్బంది పడుతోంది. ఈ విషయమై ఆమె సూసైడ్ లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడింది.


 

PREV
click me!

Recommended Stories

Top 5 Cleanest Railway Stations : దేశంలో అత్యంత పరిశుభ్రమైన రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
Christmas Holidays 2025 : ఒకటి రెండ్రోజులు కాదు... వచ్చే వారమంతా స్కూళ్ళకు సెలవులే..?