మల్లికార్జున ఖర్గే నివాసంలో సీఎల్పీ నేత ఎంపికపై చర్చ:రాహుల్ సహా కీలక నేతల భేటీ

By narsimha lode  |  First Published Dec 5, 2023, 1:26 PM IST

తెలంగాణలో కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత ఎంపిక కోసం  కాంగ్రెస్ పార్టీ  నాయకత్వం మంగళవారంనాడు  న్యూఢిల్లీలో భేటీ అయింది. కాంగ్రెస్ కీలక నేతలు  సీఎల్పీ నేత ఎంపికపై చర్చిస్తున్నారు.


న్యూఢిల్లీ:  తెలంగాణలో సీఎల్పీ నేత ఎంపిక కోసం  కాంగ్రెస్ పార్టీ అఖిలభారత అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో  మంగళవారం నాడు కాంగ్రెస్ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. సీఎల్పీ నేత ఎంపికపై నిర్ణయం తీసుకోనున్నారు. 

తెలంగాణలో  సీఎల్పీ నేత  ఎంపిక కోసం  కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైద్రాబాద్ లోని ఓ హోటల్ లో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో సీఎల్పీ నేత ఎంపికను  మల్లికార్జున ఖర్గేకు అప్పగిస్తూ  తీర్మానం చేశారు.ఈ తీర్మానాన్ని రేవంత్ రెడ్డి  ప్రతిపాదించారు.  ఈ తీర్మానాన్ని పలువురు ఎమ్మెల్యేలు బలపర్చారు.  మరో వైపు  కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో  కాంగ్రెస్ పరిశీలకులు  సీఎల్పీ నేతగా ఎవరుండాలనే దానిపై  అభిప్రాయాలను సేకరించారు.  

Latest Videos

undefined

ఈ ఎన్నికల్లో  ఓటమి పాలైన వారి నుండి కూడ  అభిప్రాయాలను సేకరించారు. ఈ రిపోర్టును కూడ  మల్లికార్జున ఖర్గేకు  కర్ణాటక డిప్యూటీ సీఎం  డీ.కే. శివకుమార్ అందించారు. సీఎల్పీ సమావేశంలో చేసిన తీర్మానంతో పాటు  ఎమ్మెల్యేల వ్యక్తిగత అభిప్రాయాలను కూడ  సమావేశంలో  అందించారు.

also read:Uttam Kumar Reddy:కర్ణాటక డిప్యూటీ సీఎం డీ.కే.శివకుమార్ తో ఉత్తమ్ భేటీ, సీఎల్పీ నేత ఎంపికపై ఉత్కంఠ

మల్లికార్జున ఖర్గే  నివాసంలో జరిగే సమావేశానికి ముందే  కర్ణాటక డిప్యూటీ సీఎం డీ.కే. శివకుమార్ తో  మాజీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గంటకు పైగా సమావేశమయ్యారు.  మరో వైపు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రేతో  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కూడ భేటీ అయ్యారు. 

సీఎల్పీ నేత ఎంపికపై తమ పేర్లను కూడ పరిగణనలోకి తీసుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కలు నేతల ముందు అభిప్రాయాలను చెప్పారని ప్రచారం సాగుతుంది. 

also read:నేడు సీఎం రేసులో ముందున్న అల్లుడు: నాడు వద్దనుకున్న మామ

నిన్న సీఎల్పీ సమావేశంలో  ఎమ్మెల్యేలు వెల్లడించిన అభిప్రాయాలను కూడ  డీ.కే. శివకుమార్  సమావేశంలో నేతలకు వివరించనున్నారు.  సీఎల్పీ నేతగా  ఎవరిని ఎంపిక చేస్తే రాష్ట్రంలో పార్టీకి ప్రయోజనంగా ఉంటుందనే అంశాన్ని కూడ  పరిగణనలోకి తీసుకొనే అవకాశం ఉంది. మరో వైపు సీఎల్పీ నేత పదవికి పోటీపడుతున్న నేతలను కూడ  ఎలా సంతృప్తి పర్చాలనే విషయమై కూడ  కాంగ్రెస్ అగ్రనేతలు చర్చిస్తున్నారు.  

రేవంత్ రెడ్డిని సీఎల్పీ నేతగా ఎంపిక చేస్తే  డిప్యూటీ సీఎం పదవిని ఇద్దరికి కేటాయిస్తారా, ఒక్కరికే ఇస్తారా, మంత్రి పదవుల్లో ఎవరెవరికి ప్రాధాన్యత ఇవ్వాలనే విషయమై  కూడ  ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి.   సీఎల్పీ పదవికి పోటీ పడుతున్న నేతలకు  ప్రాధాన్య మంత్రి పదవులను కేటాయించే అవకాశం లేకపోలేదు. అదే సమయంలో సామాజిక సమతుల్యతపై కూడ కాంగ్రెస్ నాయకత్వం  ఫోకస్ చేసే అవకాశం ఉంది.
ఇవాళ సాయంత్రానికి సీఎల్పీ నేత ఎంపికపై  కాంగ్రెస్ నాయకత్వం స్పష్టత ఇవ్వనుంది.

click me!