రాంజీ గ్యాంగ్‌పై ఎన్నో రాష్ట్రాల్లో కేసులు: మహేశ్ భగవత్

By Siva KodatiFirst Published Aug 14, 2019, 1:32 PM IST
Highlights

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వనస్థలిపురం ఏటీఎం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. రెండు నెలల పాటు తీవ్రంగా గాలించి రాంజీ గ్యాంగ్‌ను పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను రాచకొండ పోలీస్ కమీషనర్ మహేశ్ భగవత్ బుధవారం మీడియాకు తెలిపారు.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వనస్థలిపురం ఏటీఎం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. రెండు నెలల పాటు తీవ్రంగా గాలించి రాంజీ గ్యాంగ్‌ను పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను రాచకొండ పోలీస్ కమీషనర్ మహేశ్ భగవత్ బుధవారం మీడియాకు తెలిపారు.

చోరీ అనంతరం నిందితులంతా ఆటోలో తప్పించుకున్నారని... అనంతరం రైలులో సొంతవూరికి వెళ్లారని సీపీ తెలిపారు. ఈ చోరీలో భాగం పంచుకున్న రాంజీ గ్యాంగ్‌లోని మొత్తం 14 మందిని అరెస్ట్ చేశామని.. వీరిలో 11 మంది తమిళనాడు, ముగ్గురు పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారని భగవత్ పేర్కొన్నారు.

ఈ ముఠా స్వస్థలం తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లా రాంజీనగర్ గ్రామమని వెల్లడించారు. ఈ గ్రామంలోని చాలా మందికి దొంగతనాలు చేయడమే ప్రధాన వృత్తని.. వీరిపై తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటకలలో కేసులు నమోదైనట్లు సీపీ తెలిపారు.

అరెస్ట్ సమయంలో వీరి వద్ద నుంచి రూ.4.10 లక్షల నగదు, టాటా ఇండికా కారు, 6 మొబైల్ ఫోనులు స్వాధీనం చేసుకున్నామని మహేశ్ భగవత్ వెల్లడించారు. చోరీ జరిగిన తర్వాత వెంటనే స్పందించడం ఇతర రాష్ట్రాల పోలీసుల సహకారంతో నిందితులు రాంజీ గ్యాంగ‌ని తెలిసిందన్నారు.

తెలంగాణ నుంచి అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తున్నారని తెలుసుకున్న ముఠా సభ్యులు వేరు వేరు ప్రాంతాల్లో తలదాచుకున్నారని ఎస్‌ఓటీ ఇన్స్‌పెక్టర్ తెలిపారు. 

వనస్థలిపురం ఏటీఎం చోరీ కేసు: రాంజీ గ్యాంగ్‌ను పట్టుకున్న పోలీసులు

వనస్థలిపురం ఏటీఎం చోరీ: ముఠా అరెస్ట్

click me!