కొప్పుల రాజుకు బాసటగా కాంగ్రెస్ నేతలు

By narsimha lodeFirst Published Aug 14, 2019, 12:59 PM IST
Highlights

కొప్పుల రాజుకు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జీ కుంతియా అండగా నిలిచారు. టిక్కెట్ల కేటాయింపులో రాజు జోక్యం చేసుకోలేదని ఆయన ప్రకటించారు. 

హైదరాబాద్: లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల సమయంలో అభ్యర్ధుల ఎంపికలో  కొప్పుల రాజు జోక్యం చేసుకోలేదని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ కుంతియా ప్రకటించారు.

మంగళవారం నాడు కుంతియా ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేశారు.తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎన్నికల కమిటీ అభ్యర్థుల ఎంపికలో కీలక పాత్ర పోషించిందని ఆయన గుర్తు చేశారు. 

పీసీసీ నేతలతో పాటు, ఆనాడు అసెంబ్లీ విపక్షనేతతతో చర్చించిన మీదటే  అభ్యర్ధులను ఎంపిక చేసినట్టుగా ఆయన వివరణ ఇచ్చారు. అభ్యర్ధుల ఎంపికలో కొప్పుల రాజు ఎలాంటి జోక్యం చేసుకోలేదన్నారు.

పార్టీ నేతలు ఏమైనా ఫిర్యాదులు చేయలనుకొంటే  పీసీసీ లేదా ఎఐసీసీకి చేయవచ్చని కుంతియా చెప్పారు.కానీ, బహిరంగంగా మీడియాలో మాట్లాడకూడదని ఆయన సూచించారు.

తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల్లో కొప్పుల రాజుకు ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పారు.  రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ ను ఆయన పర్సనల్ అసిస్టెంట్ చూస్తారని కొప్పుల రాజుకు రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ కు ఏం సంబంధమని ఆయన ప్రశ్నించారు.
 

click me!