బ్లాక్ మార్కెట్లకు ప్రాణవాయువు.. అక్రమ రవాణాకు చెక్ పెట్టిన హైదరాబాద్ పోలీసులు

By Siva KodatiFirst Published Apr 27, 2021, 3:30 PM IST
Highlights

మరోవైపు దేశంలోని చాలా చోట్ల ఆక్సిజన్ బ్లాక్ మార్కెట్లకు తరలిపోతోంది. ఈ నేపథ్యంలో సిలిండర్ల అక్రమ రవాణాను అడ్డుకున్నారు రాచకొండ పోలీసులు.  ఆక్సిజన్ సిలిండర్ బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు.

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాజిటివ్‌గా తేలిన వారు పెద్ద ఎత్తున ఆసుపత్రులకు పోటెత్తుతున్నారు. వీరిలో కొందరి పరిస్ధితి విషమంగా వుండటంతో ఆక్సిజన్ అత్యవసరమవుతోంది.

ఇందుకు సరిపడా ఆక్సిజన్ లేక ఆసుపత్రులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచడంతో పాటు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది.

Also Read:తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్: ఒక్క రోజులోనే 10 వేలు దాటిన కేసులు, 52 మంది మృతి

మరోవైపు దేశంలోని చాలా చోట్ల ఆక్సిజన్ బ్లాక్ మార్కెట్లకు తరలిపోతోంది. ఈ నేపథ్యంలో సిలిండర్ల అక్రమ రవాణాను అడ్డుకున్నారు రాచకొండ పోలీసులు.  ఆక్సిజన్ సిలిండర్ బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు.

మాస్ ఫౌండేషన్ ఎన్జీవో పేరు చెప్పి వీరు అక్రమ వ్యాపారం చేస్తున్నట్లుగా పోలీసులు దర్యాప్తులో తేలింది. తక్కువ ధరకు ఆక్సిజన్ సిలిండర్‌‌ను తీసుకొని ఎక్కువ మొత్తానికి సిలిండర్లు సప్లై చేస్తుంది ఈ ముఠా. అయితే పక్కా సమాచారంతో ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు రాచకొండ పోలీసులు.  వీరి వద్ద నుంచి 120 కిలోల సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు.

click me!