తెలంగాణా మహానాడుకు ఆర్ కృష్ణయ్య ఎగనామం

First Published May 24, 2017, 11:43 AM IST
Highlights

ఎంతో ప్రతిష్టాత్మకంగా, తొలిసారి నిర్వహిస్తున్న టిటిడిపి మహానాడుకు పార్టీలో మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలో ఒకరయిన ఆర్  కృష్ణయ్య రాకపోవడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. కృష్ణ య్య  బిజెపి వైపు వెళతారని అనుమానాల మధ్య మహానాడుకు డుమ్మాకొట్టడం విశేషం.

హైదరాబాద్  నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఈ రోజు మొదలయిన తెలంగాణా తెలుగుదేశం పార్టీ  మహానాడుకు ఎల్ బి నగర్ ఎమ్మెల్యే  ఆర్ కృష్ణయ్య  హాజరు కాలేదు.

 

ఎంతో ప్రతిష్టాత్మకంగా, తొలిసారి నిర్వహిస్తున్న టిటిడిపి మహానాడుకు పార్టీలో మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలో ఒకరయిన కృష్ణయ్య రాకపోవడం అనేక అనుమానాలకు తావిస్తున్నది.
కృష్ణ య్య  బిజెపి వైపు వెళతారని అనుమానాల మధ్య మహానాడు డుమ్మాకొట్టడం విశేషం.


కృష్ణయ్య చాలా కాలంగా పార్టీ కార్యక్రమాలలో పాల్గొనడం లేదు.  ఎదో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయడు ఏర్పాటుచేసే సమావేశానికి తప్ప మిగతా వాటిలో కనిపించరు. టిడిపి కంటే ఆయన తన వెనకబడిన తరగతుల ఉద్యమానికే ఎక్కు వప్రాముఖ్యం ఇస్తున్నారు.


రాష్ట్రంలో వెనకబడిన ఉద్యమంతో ముడివడిన ఏకైక నాయకుడు కావడంతో 2014 ఎన్నికల పుడు చంద్రబాబు వ్యూహాత్మకంగా కృష్ణయ్యను తెలంగాణా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారం చేశాడు.  తర్వాత, పార్టీ రాలేదు. టిడిపి ఎమ్మెల్యేలంతా టిఆర్ ఎస్ లోకి వెళ్లారు. కృష్ణయ్య డల్ అయ్యారు.


 ఇపుడు  ఆయన కోసం బిజెపి గాలం వేస్తున్నదని, బిజెపి నాయకురాలు పురందేశ్వరి దౌత్యంనెరిపిందని చెబుతున్నారు. ఇలాంటపుడు ఆయన మహానాడుకు డుమ్మాకొట్టడంలో రహస్యమేముంటుంది? టిడిపికి గుడ్ బై అంటున్నారు, చాలా మంది.


 

click me!