ఏ ముఖం పెట్టుకొని పాదయాత్రలు చేస్తున్నారు: బీజేపీ, కాంగ్రెస్‌లపై హరీష్ రావు ఫైర్

Published : Apr 17, 2022, 12:39 PM IST
ఏ ముఖం పెట్టుకొని పాదయాత్రలు చేస్తున్నారు: బీజేపీ, కాంగ్రెస్‌లపై హరీష్ రావు ఫైర్

సారాంశం

ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రంలో పాదయాత్రలు చేస్తున్నాయో చెప్పాలని తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు విమర్శించారు.  ఆందోల్ నియోజకవర్గంలో దళితబంధు పథకం కింద యూనిట్ల పంపిణీ చేసే కార్యక్రమంలో  మంత్రి పాల్గొన్నారు.

హైదరాబాద్: దేశంలో పేదరికం పెరగాడనికి  Congress, BJP లే కారణమని తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి Harish Rao   విమర్శించారు.  Medak జిల్లా Andoleనియోజక వర్గంలో దళిత బందు లబ్ధిదారులకు మంత్రి హరీష్ రావు ఆదివారం నాడు  యూనిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏం ముఖం పెట్టుకొని యాత్రలు చేస్తున్నారని మంత్రి హరీష్ రావు బీజేపీ, కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు.  తెలంగాణకు బీజేపీ ఏం చేసిందని ఆయన అడిగారు. 

కేంద్రం ధరలు పెంచే ప్రభుత్వమన్నారు.. TRS  పేదలకు పంచే ప్రభుత్వంగా ఆయన  అభివర్ణించారు. బీజేపీ పేదల ఉసురు పోసుకుటుందన్నారు. పేద ప్రజలపై ప్రేమ ఉంటే గ్యాస్ ధరలను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. 
పేదల ఉసురు పోసుకుంటుందన్నారు.. పేదల మీద ప్రేమ ఉంటే గ్యాస్ ధర తగ్గించాలని ఆయన కోరారు. దేశ జనాభాలో సగం కంటే ఎక్కువ ఉన్న బిసి కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.  దళితులను కాంగ్రెస్ ఓటు బ్యాంక్ గానే చూసిందన్నారు. దళిత వర్గాలకు కాంగ్రెస్ న్యాయం చేయలేదని  ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పాటిల్, స్థానిక ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్