సాయి గణేష్ సూసైడ్: ఈ నెల 18న ఖమ్మంలో కేటీఆర్ టూర్ రద్దు

Published : Apr 17, 2022, 11:41 AM ISTUpdated : Apr 17, 2022, 12:02 PM IST
 సాయి గణేష్ సూసైడ్: ఈ నెల 18న ఖమ్మంలో కేటీఆర్ టూర్ రద్దు

సారాంశం

మంత్రి కేటీఆర్ ఈ నెల 18న ఖమ్మం టూర్ వాయిదా పడింది. మంత్రి కేటీఆర్ కు ఇతరత్రా కార్యక్రమాలున్నందున ఈ టూర్ వాయిదా పడినట్టుగా  టీఆర్ఎస్ వర్గాలు ప్రకటించాయి. అయితే బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్య కారణంగా చోటు చేసుకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలోనే  కేటీఆర్ టూర్ వాయిదా వేసుకొన్నారనే ప్రచారం కూడా లేకపోలేదు.

ఖమ్మం: ఈ నెల 18న మంత్రి కేటీఆర్ Khammam జిల్లా టూర్ వాయిదా పడింది. మరో రెండు రోజుల తర్వాత KTR పర్యటనకు సంబంధించిన తేదీలను వెల్లడించనున్నట్టుగా టీఆర్ఎస్ ప్రకటించింది. 

నెల రోజుల క్రితం కూడా మంత్రి కేటీఆర్  ఖమ్మం జిల్లా టూర్ వాయిదా పడింది. దీంతో ఈ నెల 16న  కేటీఆర్ టూర్ ను ఏర్పాటు చేశారు.  అయితే ఈ నెల 14న  ఖమ్మంలో Sai Ganesh ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 16న మరణించాడు. 

దీంతో ఈ నెల 16న కేటీఆర్ ఖమ్మం టూర్ ఈ నెల 18కి వాయిదా పడింది.  అయితే ఖమ్మంలో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఈ నెల 18న ఖమ్మం టూర్ కూడా వాయిదా పడింది. రెండు రోజుల తర్వాత కేటీఆర్ టూర్ కి సంబంధించిన  షెడ్యూల్ ను ప్రకటించనున్నట్టుగా ఆ పార్టీ నాయకత్వం ప్రకటించింది.

 మంత్రి కేటీఆర్ కు ఇతరత్రా కార్యక్రమాలున్నందున ఖమ్మం టూర్ వాయిదా పడినట్టుగా టీఆర్ఎస్ నాయకత్వం తెలిపింది. ఇదిలా ఉంటే BJP   కార్యకర్త సాయి గణేష్ సూసైడ్ నేపథ్యంలో ఖమ్మంలో ఉద్రిక్తత నెలకొన్నందున ఖమ్ం టూర్ ను కేటీఆర్ వాయిదా వేసుకోవాలని ఇంటలిజెన్స్ వర్గాలు సూచించడంతో ఈ టూర్ వాయిదా పడిందని చెబుతున్నారు.

ఖమ్మంలో సాయి గణేష్ తన ఆత్మహత్యకు మంత్రి పువ్వాడ అజయ్ కారణమని  ఆరోపించారు. ఆత్మహత్య తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మీడియాతో మాట్లాడారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 16న సాయి గణేష్ మరణించాడు.  సాయి గణేష్ మరణానికి కారణమైన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై కేసు నమోదు చేయాలని బీజేపీ నేతలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.  

ఈ నెల 16న సభను ఏర్పాటు చేశారు. ఖమ్మంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.  సాయి గణేష్ మృతి చెందిన విషయం  తెలుసుకొన్న బీజేపీ క్యాడర్  ఆందోళనకు దిగింది. ఆసుపత్రిపై దాడి చేసింది.  ఖమ్మంలో ఏర్పాటు చేసిన మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీలను కూడా ధ్వంసం చేశారు బీజేపీ శ్రేణులు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు