బాసర ఆలయంలో కొండ చిలువ : నాగుల పంచమి కావడంతో భక్తుల పూజలు

By Siva KodatiFirst Published Jul 25, 2020, 5:53 PM IST
Highlights

తెలంగాణలోని ప్రఖ్యాత ఆలయం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో కొండ చిలువ కలకలం రేపింది. ఆలయంలోని అక్షరాభ్యాస మండపం ప్రధాన ద్వారం ముందు ఓ భారీ కొండ చిలువ కనిపించింది

తెలంగాణలోని ప్రఖ్యాత ఆలయం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో కొండ చిలువ కలకలం రేపింది. ఆలయంలోని అక్షరాభ్యాస మండపం ప్రధాన ద్వారం ముందు ఓ భారీ కొండ చిలువ కనిపించింది.

ఇవాళ శ్రావణ మాసం మొదటి శనివారం పైగా నాగుల పంచమి కావడంతో లింగాకారంలో కొండ చిలువ దర్శనం ఇచ్చిందని భక్తులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా కొందరు భక్తులు కొండ చిలువకు పాలు పోసి పూజలు చేశారు.

మరోవైపు ఆలయ సిబ్బంది అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఇకపోతే ఆదిలాబాద్ మండల పరిధిలోని అర్లిబి గ్రామంలో రెండు జంట నాగుల సయ్యాటలాడాయి. శనివారం నాగుల పంచమి కావడంతో రెండు నాగుపాములు ఆడుతూ కనిపించడంతో స్థానికులు ఆసక్తికరంగా వీక్షించారు. 

click me!