తిమ్మారెడ్డి కిడ్నాప్ కేసు: హైకోర్టులో పీవీపీకి ఊరట, కానీ...

By telugu teamFirst Published Jul 27, 2020, 1:06 PM IST
Highlights

ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ తిమ్మారెడ్డి కిడ్నాప్ కేసులో వైసీపీ నేత పీవీపికి హైకోర్టులో ఊరట లభించింది. పీవీపితో పాటు మరికొంత మందికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

హైదరాబాద్: ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ తిమ్మారెడ్డి కిడ్నాప్ కేసులో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేత పీవీపికి హైకోర్టులో ఊరట లభించింది. పి. వరప్రసాద్ తో పాటు మరికొంత మందికి హైకోర్టు ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది. అయితే, పోలీసుల ముందు లొంగిపోవాల్సిందేనని ఆదేశించింది.

తిమ్మారెడ్డి కిడ్నాప్ కేసులో నాలుగు వారాల లోగా హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ లో లొంగిపోవాలని హైకోర్టు పివీపీని, ఇతరులను ఆదేశించింది. నిరుడు సెప్టెంబర్ లో తన భర్తను పీవీపి బౌన్సర్లు కిడ్నాప్ చేిస విజయవాడకు తీసుకుని వెళ్లారని ఆరోపిస్తూ తిమ్మారెడ్డి భార్య జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. 

పీవీపితో పాటు మరికొందరు తనను కిడ్నాప్ చేసి, విజయవాడ ఆస్పత్రిలో చేర్చారని తిమ్మారెడ్డి తన వాంగ్మూలంలో తెలిపారు. ఆ ఘటన విషయంలో పీవీపీపైనా, ఆయన భార్యపైనా, మరికొందరి మీద పోలీసులు కేసులు నమోదు చేశారు. 

అయితే, తిమ్మారెడ్డి కిడ్నాప్ తో తనకు ఏ విధమైన సంబంధం లేదని అంటూ ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ పీవీపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తిమ్మారెడ్డిని తాము విజయవాడ ఆస్పత్రిలో చేర్చలేదని చెప్పారు. 

ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు తిమ్మారెడ్డిని కిడ్నాప్ చేసినట్లు ఆధారాలు లేకపోవడంతో పివీపికి, మిగతావారికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

click me!