కవిత, సంతోష్ ల గురించి మాట్లాడితే సహించేదిలేదు: ఈటలకు పుట్టా మధు వార్నింగ్ (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Jun 06, 2021, 01:11 PM ISTUpdated : Jun 06, 2021, 01:33 PM IST
కవిత, సంతోష్ ల గురించి మాట్లాడితే సహించేదిలేదు: ఈటలకు పుట్టా మధు వార్నింగ్ (వీడియో)

సారాంశం

ఈటల రాజేందర్ భూమి వివాదాల గురించి తానేమీ చెప్పలేనని... అయితే కల్వకుంట్ల కవిత గురించి, ఎంపి సంతోష్ కుమార్ గురించి ఆయన మాట్లాడితే సహించబోమని పుట్టా మధు హెచ్చరించారు. 

పెద్దపల్లి: సీఎం కేసీఆర్ కూతురు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పుట్ట మధు కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత పదవులపై ఎప్పుడు ఆశ పడలేదన్నారు. ఆమెపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 

రామగిరి మండలం సెంటనరీ కాలనీలోని టిబిజికెఎస్ కార్యాలయంలో పుట్ట మధు మాట్లాడుతూ... ఈటల రాజేందర్ భూమి వివాదాల గురించి తానేమీ చెప్పలేనని... అయితే కల్వకుంట్ల కవిత గురించి, ఎంపి సంతోష్ కుమార్ గురించి ఆయన మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. 

read more  మంత్రులకు స్వేచ్ఛ లేదు, ప్రాణాలతో బొందపెట్టాలనుకొన్నారు: కేసీఆర్‌పై ఈటల సంచలనం

''మంథనిని చీకటి పాలనను అంతమొందించి, అభివృద్ధి దిశగా తీసుకెళ్ళింది కల్వకుంట్ల కవితక్క. అలాంటి కవితక్క గురించి ఈటల ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదు. అలాగే ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గురించి కూడా ఈటల మాట్లాడిదాన్ని మేం త్రీవంగా ఖండిస్తున్నాం'' అన్నారు. 

''సంతోష్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం పాటుపడిన వ్యక్తి,. టీఆర్ఎస్ ప్రధాన రాష్ట్ర కార్యదర్శిగా ఉండి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేశారు. కాబట్టి కవిత, సంతోష్ లకు ఎన్ని పదవులు ఇచ్చిన తక్కవే'' అని పుట్ట మధు అభిప్రాయపడ్డారు. 

వీడియో

"

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ