అలా అయితే టీఆర్ఎస్‌కే మా మద్దతు: పురంధేశ్వరీ

Published : Dec 09, 2018, 12:23 PM IST
అలా అయితే  టీఆర్ఎస్‌కే మా మద్దతు: పురంధేశ్వరీ

సారాంశం

 తెలంగాణలో ఎంఐఎంతో జత కట్టకపోతే తమ పార్టీ  టీఆర్ఎస్‌కే మద్దతు ఇవ్వనుందని  బీజేపీ నేత , మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరీ  ప్రకటించారు.  


హైదరాబాద్: తెలంగాణలో ఎంఐఎంతో జత కట్టకపోతే తమ పార్టీ  టీఆర్ఎస్‌కే మద్దతు ఇవ్వనుందని  బీజేపీ నేత , మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరీ  ప్రకటించారు.

ఆదివారం నాడు ఆమె అనంతపురంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ 7వ తేదీన జరిగాయి. ఇప్పటికే ఎగ్జిట్ ఫలితాలు విడుదలయ్యాయి. డిసెంబర్ 11వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. 

ఒకవేళ తెలంగాణలో  హంగ్ అసెంబ్లీ ఏర్పడితే  బీజేపీ ఎటువైపు మొగ్గు చూపుతోందోననే  దానికి ఆ పార్టీ స్పష్టత ఇచ్చింది. కానీ, ఇప్పటికే వచ్చిన ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ టీఆర్ఎస్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని ప్రకటించింది. లగడపాటి రాజగోపాల్ మాత్రం ప్రజా కూటమికి ఎక్కువ సీట్లను కైవసం చేసుకొంటుందని ప్రకటించారు.

ఈ ఫలితాల వెలువడనున్న నేపథ్యంలో బీజేపీ నేత పురంధేశ్వరీ  చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ఈ ఎన్నికల్లో  టీఆర్ఎస్ ఎంఐఎం మిత్రపక్షాలుగా బరిలోకి దిగాయి. కాంగ్రెస్ తో  జత కట్టి చంద్రబాబునాయుడు అప్రజాస్వామ్యమని ఆయన  పురంధేశ్వరీ చెప్పారు.సీపీఎస్ ఉద్యోగులకు మేం అనుకూలంగా వ్యవహరిస్తామని ఆమె హమీ ఇచ్చారు.


 

PREV
click me!

Recommended Stories

Bullet Train India: దూసుకొస్తున్న బుల్లెట్ ట్రైన్.. హైదరాబాద్, అమరావతి రూట్లలో గంటలో ప్రయాణం
MLC Kavitha: బబుల్ షూటర్ వల్లే కేసిఆర్ కి ట్రబుల్ హరీశ్ రావుపై కవిత సెటైర్లు | Asianet News Telugu