
హైదరాబాద్: కొత్తగా ఎన్నికయ్యే ఎమ్మెల్యేల కోసం తెలంగాణ అసెంబ్లీని ముస్తాబు చేస్తున్నారు. అసెంబ్లీ ప్రాంగంణంలో ఆహ్లాదకర వాతావరణం ఉండేలా మొక్కలను నాటారు. అసెంబ్లీని కొత్త ఎమ్మెల్యేల కోసం మార్చుతున్నారు.
ఈ నెల 7వ తేదీన తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఈ నెల 11వ తేదీన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. కొత్తగా ఎన్నికయ్యే ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేసేందుకుగాను తెలంగాణ అసెంబ్లీని ముస్తాబు చేస్తున్నారు.
ఏ గ్రామంలో ఏ రకంగా తమకు ఓట్లు వచ్చాయనే విషయమై అభ్యర్థులు లెక్కలు వేసుకొంటున్నారు. మరో రెండు రోజుల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. కొత్తగా ఎన్నికయ్యే ఎమ్మెల్యేల కోసం అసెంబ్లీని ముస్తాబు చేస్తున్నారు.
ఫుట్ పాత్ లకు కొత్త టైల్స్ వేశారు. అసెంబ్లీ హాల్ లో కొత్త గ్రీన్ కలర్ కార్పెట్ ను ఏర్పాటు చేశారు. లైబ్రరీ, మీడియా పాయింట్, డిస్పెన్సరీల వద్ద చిన్నచిన్న మరమ్మతులను యుద్ధప్రాతిపదికన చేస్తున్నారు. సభ్యుల ప్రమాణస్వీకారం నాటికి అసెంబ్లీ సర్వాంగ సుందరంగా తయారుకానుంది.