గాంధీ భవన్‌లో సోనియా బర్త్‌డే వేడుకలు

Published : Dec 09, 2018, 11:33 AM ISTUpdated : Dec 09, 2018, 11:36 AM IST
గాంధీ భవన్‌లో సోనియా బర్త్‌డే వేడుకలు

సారాంశం

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు  సోనియాగాంధీ పుట్టినరోజును పురస్కరించుకొని ఆదివారం నాడు గాంధీ భవన్‌లో టీపీసీసీ చీఫ్  ఉత్తమ్ కుమార్ రెడ్డి కేక్ కట్ చేశారు. 

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు  సోనియాగాంధీ పుట్టినరోజును పురస్కరించుకొని ఆదివారం నాడు గాంధీ భవన్‌లో టీపీసీసీ చీఫ్  ఉత్తమ్ కుమార్ రెడ్డి కేక్ కట్ చేశారు. 

10 ఏళ్ల పాటు  యూపీఏ అధికారంలో  ఉన్న కాలంలో  అనేక సంక్షేమ కార్యక్రమాలకు సోనియా గాంధీ కారణమని ఆయన చెప్పారు.ఫుడ్ సెక్యూరిటీ చట్టం, ఆర్టీఐ చట్టం, రైట్ టూ ఎడ్యుకేషన్  లాంటి చట్టాల ఏర్పాటులో సోనియా పాత్రను మరవలేమన్నారు.

దేశ చరిత్రలో మరిచిపోలేని చారిత్రాత్మకమైన చట్టాలను  తేవడంలో  తెర వెనుక సోనియా కీలక పాత్ర పోషించారని చెప్పారు. తెలంగాణ  రాష్ట్ర ఏర్పాటులో సోనియాగాంధీ పాత్రను మరవలేమన్నారు. సోనియాగాంధీ మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాల్సిన అవసరం ఉందని  ఆయన కోరారు.


 

PREV
click me!

Recommended Stories

Bullet Train India: దూసుకొస్తున్న బుల్లెట్ ట్రైన్.. హైదరాబాద్, అమరావతి రూట్లలో గంటలో ప్రయాణం
MLC Kavitha: బబుల్ షూటర్ వల్లే కేసిఆర్ కి ట్రబుల్ హరీశ్ రావుపై కవిత సెటైర్లు | Asianet News Telugu