ప్రయాణీకుడి విజ్ఞప్తి.. కేటీఆర్‌ రిక్వెస్ట్‌కు హైదరాబాద్‌ మెట్రో స్పందన, రేపటి నుంచి ఉదయం ఆరుకే సర్వీసులు

Siva Kodati |  
Published : Nov 09, 2021, 10:19 PM ISTUpdated : Nov 09, 2021, 10:20 PM IST
ప్రయాణీకుడి విజ్ఞప్తి.. కేటీఆర్‌ రిక్వెస్ట్‌కు హైదరాబాద్‌ మెట్రో స్పందన, రేపటి నుంచి ఉదయం ఆరుకే సర్వీసులు

సారాంశం

హైదరాబాద్‌ మెట్రో రైలు (hyderabad metro rail) ప్రయాణీకులకు శుభవార్త. ఇకపై ఉదయం 6 గంటల నుంచే మెట్రో అందుబాటులోకి రానుంది. అభినవ్ సుదర్శి అనే ప్రయాణికుడు ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్‌కి చేసిన విజ్ఞప్తితో  ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది.

హైదరాబాద్‌ మెట్రో రైలు (hyderabad metro rail) ప్రయాణీకులకు శుభవార్త. ఇకపై ఉదయం 6 గంటల నుంచే మెట్రో అందుబాటులోకి రానుంది. కొద్దిరోజుల క్రితం అభినవ్ సుదర్శి అనే ప్రయాణికుడు ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్‌కి (minister ktr) ఒక మెసేజ్ పంపారు. అందులో ఈ విధంగా ఉంది. ప్రజలు ఉదయం 6 గంటలకు మెట్రో స్టేషన్‌లకు చేరుకుంటున్నారని.. కానీ 7 గంటల వరకు మెట్రో రైళ్లు సేవలు ప్రారంభమవడం లేదన సుదర్శి ఆవేదన  వ్యక్తం చేశారు. 

Also Read:తెలంగాణ పథకాలకు బండి సంజయ్ బ్రాండ్ అంబాసిడర్: కేటీఆర్

క్యాబ్‌లు తీసుకోవడం ద్వారా ఆఫీసులకు చేరుకోవడానికి ప్రయత్నించినా చాలా ఖర్చు అవుతుందని చెప్పారు. దీనివల్ల సీనియర్ సిటిజన్లు ఉదయం పూట రద్దీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సుదర్శి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అందువల్ల మెట్రో సేవలు ఉదయం 6 గంటల నుంచి ప్రారంభించేలా చూడాలి అని కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ఫోటోలు, వీడియోలను కూడా జత చేశారు. స్పందించిన మంత్రి కేటీఆర్ ఆ విషయాన్ని హైదరాబాద్ మెట్రో ఎండీ (hyderabad metr md) ఎన్‌విఎస్ రెడ్డికి (nvs reddy) ట్యాగ్‌ చేశారు. సదరు ప్రయాణికుడి అభ్యర్థనను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు.

ఈ విషయంపై స్పందించిన హెచ్‌ఎంఆర్‌ఎల్ (hmrl) ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మంత్రి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించారు. నవంబర్‌ 10 నుంచి ఉదయం 6 గంటలకే మెట్రో రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. అలాగే రాత్రి 10.15 గంటలకు చివరి స్టేషన్‌ నుంచి మెట్రో రైలు బయలుదేరి.. రాత్రి 11.15 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుందని హైదరాబాద్ మెట్రో తెలిపింది. 

PREV
click me!

Recommended Stories

డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!
హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం