హత్యా, ఆత్మహత్యా?... హైదరాబాద్ లో పంజాబీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడి మృతి

Arun Kumar P   | Asianet News
Published : Sep 01, 2021, 10:34 AM ISTUpdated : Sep 01, 2021, 10:37 AM IST
హత్యా, ఆత్మహత్యా?... హైదరాబాద్ లో పంజాబీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడి మృతి

సారాంశం

పంజాబీ వెల్ఫేర్ అసోసియుషన్ అధ్యక్షుడు రంజవత్ గులాటీ  ఆల్వాల్ లోని సొంతింట్లో అనుమానాస్పద రీతిలో మరణించారు. 

సికింద్రాబాద్: అల్వాల్ గురుద్వారా అధ్యక్షుడు, పంజాబీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రంజవత్ గులాటీ అనుమానాస్పద రీతితో మృతిచెందారు. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంనగర్ కాలనీలోని సొంతింట్లోనే గులాటి బుధవారం ఉదయం మృతిచెందారు. 

అయితే కుటుంబసభ్యులు సమాచారం అందించడంతో గులాటీ ఇంటికి చేరుకున్న మృతదేహాన్ని, పరిసరాలను పరిశీలించారు. ఆ ఇంట్లో అక్కడక్కడ రక్తపు మరకలు వుండటంతో అనుమానించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డాగ్ స్వాడ్, క్లూస్ టీమ్ తో ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు. 

read more  కరీంనగర్: పుటినొప్పులతో మహిళా పోలీస్ మృతి... కుటుంబసభ్యుల ఆందోళన

గులాటి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. పోస్టుమార్టం రిపోర్ట్ తో గులాటీది హత్యో, ఆత్మహత్యో తేలనుంది. సేవా కార్యక్రమాల్లో ముందుండే గులాటి హత్య చేశారా? చేస్తే ఎవరు చేశారు అనే కోణంలో  విచారణ కొనసాగుతోంది. 

PREV
click me!

Recommended Stories

Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి
ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌కు దూరంగా అభివృద్ధికి ద‌గ్గ‌ర‌గా.. ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.