మోటివేషనల్ స్పీచ్ పేరిట కీచకపర్వం.. పోలీసుల అదుపులో సైకియాట్రిస్ట్, 100 మందికిపైగా బాధితులు

Siva Kodati |  
Published : Sep 03, 2022, 07:15 PM IST
మోటివేషనల్ స్పీచ్ పేరిట కీచకపర్వం.. పోలీసుల అదుపులో సైకియాట్రిస్ట్, 100 మందికిపైగా బాధితులు

సారాంశం

కాలేజీలు, ఇన్‌స్టిట్యూట్‌లలో మోటివేషన్ స్పీచ్‌లు ఇస్తూ అమ్మాయిల ఫోన్ నెంబర్లు తీసుకుని వారిని వేధిస్తున్న సైకియాట్రిస్ట్‌ నగేశ్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను వందమందికి పైగా అమ్మాయిలని వేధించినట్లుగా పోలీసులు తేల్చారు

హైదరాబాద్‌లో ప్రముఖ సైకియాట్రిస్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని కాలేజీలు, ఇన్‌స్టిట్యూట్‌లలో మోటివేషన్ స్పీచ్‌లు ఇస్తున్న డాక్టర్ నగేశ్‌గా గుర్తించాడు. ఇతను స్పీచ్‌లు ఇస్తూ.. అమ్మాయిల ఫోన్ నెంబర్లు తీసుకునేవాడు. అనంతరం ఆ ఫోన్ నెంబర్‌ల ద్వారా అమ్మాయిలతో సెక్స్ ఛాటింగ్ చేసేవాడు. వందమందికి పైగా అమ్మాయిలని వేధించినట్లుగా పోలీసులు తేల్చారు. సెక్స్ ఛాటింగ్ చేయాలని అమ్మాయిలను ఇబ్బంది పెట్టాడు నగేశ్. ఈ క్రమంలో అతని వేధింపులు ఎక్కువ కావడంతో అమ్మాయిలు షీటీమ్‌ను ఆశ్రయించారు. డాక్టర్ నగేశ్ స్వస్థలం గుంటూరు. అతనిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించింది షీటీమ్స్. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!
హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం