లింగంపల్లి రైల్వే స్టేషన్ లో భద్రత లేదు (వీడియో)

First Published Dec 27, 2017, 8:05 PM IST
Highlights
  • సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలి
  • వినోద్ యాదవ్ కు నాగేందర్ వినతి

 లో ప్రయాణికుల సౌకర్యార్థం మౌలిక‌ వసతులు కల్పించాలని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ దక్షిణ మద్య రైల్వే జీఎం వినోద్ కుమార్ యాదవ్ ను కోరారు. బుధవారం సాయంత్రం లింగంపల్లి రైల్వే స్టేషన్ కు వచ్చిన రైల్వే జీఎం వినోద్ కుమార్ యాదవ్ ను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలను అందజేశారు. రైల్వే స్టేషన్ లో భద్రతను మరింత పటిష్టం చేసేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరగా తక్షణమే స్పందించిన జీఎం 25 సీసీ కెమెరాలను మంజూరు చేశారు. ఎస్కిలేటర్, లిప్ట్ తో పాటు స్వచ్ఛమైన నీటి సదుపాయం కల్పించాలని, ఎంఎంటీఎస్ రైల్వే లైన్ ను వికారాబాద్ వరకు పొడగించాలని, ఎక్స్ ప్రెస్ రైళ్లను లింగంపల్లి స్టేషన్ నుంచి వెళ్లేలా చూడాలని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కోరగా అందుకు రైల్వే జీఎం సానుకూలంగా స్పందించారు. వినతి పత్రం అందజేసిన వారిలో మాజీ కౌన్సిలర్లు దుర్గం వీరేశం గౌడ్, సోమదాస్ తో పాటు రవీంద్రనాథ్, సుబ్రహ్మణ్యం తదితరులు ఉన్నారు‌. వినతిపత్రం సమర్పించిన వీడియో కింద చూడొచ్చు.

click me!