పౌరసత్వ సవరణ చట్టం: హైద్రాబాద్‌ 'మను' యూనివర్శిటీలో విద్యార్థుల ఆందోళన

By narsimha lodeFirst Published Dec 16, 2019, 7:32 AM IST
Highlights

హైద్రాబాద్ కు చెందిన మను యూనివర్శిటీ విద్యార్థులు కూడ పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. 


హైదరాబాద్: పౌరసత్వ  సవరణ చట్టాన్ని నిరసిస్తూ హైద్రాబాద్ మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్ధూ విశ్వవిద్యాలయం(మను) కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆదివారం నాడు ఆందోళనలు జరిగాయి. ఢిల్లీలో జామియా యూనివర్శిటీలో ఆందోళనలు చోటు చేసుకొన్న తర్వాత హైద్రాబాద్‌లో కూడ విద్యార్ధులు ఆందోళనకు దిగారు

Also read:పౌరసత్వ రగడ: ఢిల్లీలో నిరసన హింసాత్మకం.

ఢిల్లీలోని జామియా యూనివర్శిటీ  విద్యార్ధులపై లాఠీచార్జీని నిరసిస్తూ మను యూనివర్శిటీ విద్యార్ధులు ఆదివారం నాడు హైద్రాబాద్ లో ఆందోళనకు దిగారు. యూనివర్శిటీ ప్రధాన గేటు వద్ద భైఠాయించి ఆందోళన చేశారు. 

ఆదివారం రాత్రి పదకొండున్నర సమయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను విద్యార్ధులు దగ్ధం చేశారు. ఢిల్లీలోని జామియా యూనివర్శిటీ విద్యార్ధులపై పోలీసులు లాఠీచార్జీ చేయడాన్ని విద్యార్థులు తీవ్రంగా ఖండించారు. 

మరో వైపు జామియా యూనివర్శిటీ విద్యార్ధులకు హైద్రాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తన సంఘీభావాన్ని ప్రకటించారు.

click me!