కేఏ పాల్ దెబ్బ: రామ్ గోపాల్ వర్మకు నోటీస్ జారీ చేసిన పోలీసులు

By telugu teamFirst Published Dec 15, 2019, 8:41 PM IST
Highlights

కేఏ పాల్ ఫొటో మార్ఫింగ్ చేసి అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా ప్రమోషన్ కోసం వాడుకున్నట్లు వచ్చిన ఆరోపణలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ పోలీసులు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు నోటీసులు జారీ చేశారు.

హైదరాబాద్: ప్రముఖ సినీ దర్శకుడు, నిర్మాత రామ్ గోపాల్ వర్మకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. తమ ఎదుట సోమవారం హాజరు కావాలని వారు ఆయనను ఆదేశించారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వర్మపై కేసు నమోదు చేసారు. 

అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా ప్రమోషన్ లో భాగంగా రామ్ గోపాల్ వర్మ కేఏ పాల్ ఫొటోను మార్ఫింగ్ చేసి తనకు సెన్సార్ సర్టిఫికెట్ ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. 

దానిపై కేఏ పాల్ కోడలు బెగాల్ జ్యోతి సోమవారం సిసిఎస్ సైబర్ క్రైమ్స్ లో ఫిర్యాదు చేశారు. తమ అనుమతి లేకుిం్డా ఫొటోలను మార్ఫింగ్ చేయడమే కాకుండా ఇష్టానుసారంగా తమపై ప్రచారం చేసిన వర్మపై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు. 

ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అదివారం రామ్ గోపాల్ వర్మకు నోటీసులు జారీ చేశారు. సోమవారం ఉదయం వర్మ సైబర్ క్రైమ్ పోలీసులు ఎదుట హాజరయ్యే అవకాశం ఉంది.

click me!